అశోక్ గల్లా, అర్జున్ జంధ్యాల, లలితాంబిక ప్రొడక్షన్స్ ‘దేవకీ నందన వాసుదేవ’ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్న శంకర్ పిక్చర్స్

0
170
Galla Ashok - Devaki Nandana Vasudeva - Shankar Pictures
Galla Ashok - Devaki Nandana Vasudeva - Shankar Pictures

అశోక్ గల్లా, అర్జున్ జంధ్యాల, లలితాంబిక ప్రొడక్షన్స్ ‘దేవకీ నందన వాసుదేవ’ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్న శంకర్ పిక్చర్స్

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’ లో మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే మొదటి రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి.

గుణ 369తో ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. శంకర్ పిక్చర్స్ ఈ మూవీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్‌ను భారీ ధరకు దక్కించుకుని, బిగ్గర్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.

డివైన్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో అశోక్ గల్లా సరసన వారణాసి మానస కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి హను మాన్ ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు.

ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో అందించగా, సినిమాటోగ్రఫీని ప్రసాద్ మూరెళ్ల, రసూల్ ఎల్లోర్ నిర్వహిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌.

దేవకి నందన వాసుదేవ మూవీ నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

నటీనటులు: అశోక్ గల్లా, వారణాసి మానస

సాంకేతిక సిబ్బంది:
కథ: ప్రశాంత్ వర్మ
దర్శకత్వం: అర్జున్ జంధ్యాల
నిర్మాత: సోమినేని బాలకృష్ణ
బ్యానర్: లలితాంబిక ప్రొడక్షన్స్
సమర్పణ: నల్లపనేని యామిని
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: ప్రసాద్ మూరెళ్ల, రసూల్ ఎల్లోర్
ఎడిటర్: తమ్మిరాజు
డైలాగ్స్: బుర్రా సాయి మాధవ్
పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే
పీఆర్వో: వంశీ-శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here