‘ద డీల్’ – రివ్యూ
చిత్రం: ‘ద డీల్’
విడుదల తేదీ: 18-10-2024
నటీనటులు – డా.హను కోట్ల, చందన, ధరణి ప్రియ, రవి ప్రకాష్, మహేశ్ పవన్, గిరి, డా.వెంకట్ గొవడ, శ్రీ వాణి, సుజాత దీక్షిత్, సురభి లలిత, అంజి వల్గుమన్, సమీర్ దత్తా, తదితరులు
డి. ఓ. పి – సురేంద్ర రెడ్డి
సంగీత దర్శకుడు – ఆర్. ఆర్. ధృవన్:
ఎడిటింగ్ – శ్రవణ్ కటికనేని,
వి. ఎఫ్. ఎక్స్ – నవీన్
డి. ఐ – వినోద్ సాయి కుమార్
కొరియోగ్రఫీ – అనితారావు,
అసిస్టెంట్ డైరెక్టర్ – వినయ్ కుమార్ కాటం, అదితి నాగ్
అసోసియేట్ డైరెక్టర్ – అరుణ్ / కిరంజీవి
కో డైరెక్టర్ – శ్రీధర్ దీక్షిత్
పీఆర్వో – కృష్ణప్రసాద్
నిర్మాతలు – హెచ్ పద్మా రమకాంతరావు, రామకృష్ణ కొళివి
దర్శకుడు: హను కోట్ల
రెబల్ స్టార్ ప్రభాస్ మొదటి చిత్రం ‘ఈశ్వర్` సినిమాతో ఇండస్ట్రీకి నటుడిగా పరిచయం అయిన డా హను కోట్ల హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ది డీల్. డా. హను కోట్ల కు నాటకరంగంలో ప్రావీణ్యం కూడా ఉంది. కెరీర్ ప్రారంభ దశలో ఈటీవీ మాయాబజార్‌లో 150 ఎపిసోడ్స్ దాకా చేశాడు. ఈ చిత్రంలో చందన, ధరణి ప్రియ హీరోయిన్లుగా నటించారు. సిటాడెల్ క్రియేషన్స్, డిజిక్వెస్ట్ బ్యానర్‌పై హెచ్. పద్మా రమాకాంతరావు, రామకృష్ణ కొళివి నిర్మించగా… సంగీత దర్శకుడిగా ఆర్‌ఆర్ ధృవన్ ‘ద డీల్’కు బాణీలు సమకూర్చారు. సినిమాటోగ్రఫర్‌గా సురేందర్‌రెడ్డి చేయగా…ఎడిటర్‌గా కటికనేని శ్రావణ్ పనిచేశారు. విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
హీరో ఒక అనాథ. ఈ క్రమంలో అతడు పిల్లాడిగా ఉన్న సమయంలో ఓ తల్లి చేరదీసి పెంచి పెద్దచేస్తుంది. ఆమెకు పిల్లలు లేకపోవడంతో అల్లారుముద్దుగా తనకున్న దాంట్లో జీవనం గడుపుతూ ఉంటుంది. అయితే ఒకానొక దశలో ఆమె పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో పేదరికంలో ఉన్న అతనికి, తన తల్లిని కాపాడుకోవడం పెద్ద సవాల్‌గా మారుతుంది. అయితే, సరిగ్గా ఆ సమయంలో అతనికి ఒక క్రిమినల్ ముఠా నుంచి ఓ అమ్మాయిని చంపాలని డీల్ వస్తుంది. అందుకుగాను పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామని చెప్పడంతో అమ్మను కాపాడుకోవటం కోసం అమ్మాయిని చంపుకునేందుకు ఒప్పుకుంటాడు.
భైరవ (హనుకోట్ల) యాక్సిడెంట్‌కి గురై కోమాలోకి వెళ్తాడు. మూడు నెలల తర్వాత నెమ్మదిగా ఆ కోమా నుంచి బయటకు వస్తుంటాడు. కానీ తను గతం మర్చిపోతాడు. కోమాలో నుంచి బయటకు వచ్చినప్పుడు లక్ష్మి(ధరణి ప్రియా)ని తలుచుకుంటాడు. ఆమె తన భార్య అని, ఆమెని చూడాలని, కలవాలని అంటుంటాడు. తానెవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు.
ఈ క్రమంలో ఓ విలన్ ఇందు(సాయి చందన)ని చంపేసే ప్రయత్నం చేస్తుంటాడు. దీని వెనకాల మాదవ్(రవి ప్రకాష్) ఉంటాడు. ఇందు ఎవరూ లేని ఒంటరి మహిళ. అమ్మ చాలా రోజుల క్రితమే చనిపోతుంది. తను బ్యాంక్ లో ఎంప్లాయ్‌గా పని చేస్తుంటుంది. ఇందుని కాపాడి ఆమెకి దగ్గరవుతాడు భైరవ.
మరి భైరవ భార్య అయిన లక్ష్మి మాదవ్‌ని భైరవగా ఎందుకు చెబుతుంది? ఇందుని ఎందుకు చంపాలనుకుంటున్నారు? మధ్యలో ఇందు గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంపెనీ అధినేత రావు(రఘు కుంచె).. ఇందుకి ఒక సామాన్యుడిగా ఎందుకు పరిచయం అయ్యాడు? ఈ మొత్తం కథకి? ఇందుకి ఉన్న సంబంధమేంటి? చివరికి కథ ఎలాంటి మలుపులు తిరిగిందనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు:
భైరవ పాత్రలో డా. హను కోట్ల బాగా చేశాడు. చాలా చోట్ల సెటిల్డ్ గా చేసి మెప్పించాడు. హీరోయిజానికి పోకుండా సింపుల్‌గా కనిపిస్తూ కథని మలుపు తిప్పిన తీరు బాగుంది. పాజిటివ్‌గా, నెగటివ్‌గా ఆయన చూపించిన వేరియేషన్స్ బాగున్నాయి. ఆయన పాత్ర చుట్టూతనే సినిమా సాగుతుంది. ఆయనే సినిమాకి మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు. హీరోయిన్ సాయిచందన అయితే పక్కింటి అమ్మాయిలా ఉంటుంది. హీరోకి తగ్గ జోడీగా చెప్పొచ్చు. ఇందులో ధరణిప్రియ విలన్ గ్యాంగ్‌లో ఉండి గ్లామర్ రోల్‌లో పండించింది.
రావు పాత్రలో రఘు కుంచె హుందాగా చేశాడు. తనదైన నటనతో మెప్పించాడు. రవి ప్రకాష్ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో ఆకట్టుకున్నాడు. రావు కుమారుడుగా మహేష్ పవన్ చివర్లో ఇచ్చిన ట్విస్ట్ హైలైట్. కాసేపు కనిపించినా ఆకట్టుకున్నాడు. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు:
‘ద డీల్’ మూవీ కథనానికి వస్తే ట్విస్టుల మీద సాగిందనే చెప్పొచ్చు. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీకి పెద్దకష్టమే పడ్డారని తెలుస్తోంది. తరువాత సీన్ ఏంటనేది తెలియకుండా చక్కటి స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘ద డీల్’ టీమ్. రవిప్రకాశ్, రఘుకుంచె, శ్రీ గిరి లాంటి సీనియర్ ఆర్టిస్టుల అనుభవం ద డీల్ మూవీకి పెద్ద అస్సెట్‌గా చూడొచ్చు.
సినిమాకి ఆర్ ఆర్ ధృవన్ సంగీతం ఓకే అనిపించేలా ఉంది. బీజీఎం మైనస్‌గా చెప్పొచ్చు. చాలా చోట్ల తేలిపోయింది. శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ కూడా ఇంకా బాగా ఎడిటింగ్ చేయాల్సింది. చాలా చోట్ల కథ అక్కడక్కడే తిరిగినట్టుగా ఉంటుంది. సురేంద్ర రెడ్డి కెమెరా వర్క్ ఓకే అని చెప్పొచ్చు.. నిర్మాణ విలువలు ఉన్నంతలో ఓకే అనిపించాయి.
ఇక దర్శకుడు కథ రెగ్యూలర్‌గానే తీసుకున్నా, తాను ట్విస్ట్ లతో రాసుకున్న తీరు బాగుంది. ట్విస్ట్ లు సినిమాకి రిలీఫ్‌నిచ్చే అంశాలు. సినిమాలో డ్రామా మేజర్ పార్ట్ ని పోషిస్తుంది. ఓ వైపు హీరోగా నటిస్తూ సినిమాని రూపొందించడం పెద్ద టాస్క్. ఈ విషయంలో దర్శకుడిని అభినందించాల్సిందే. ఈ మూవీ ద్వారా మంచి ప్రయత్నం చేశారని
రేటింగ్: 2.75/5
ట్యాగ్ లైన్ : ‘ద డీల్’ ఒక మంచి ప్రయత్నం




