‘మెకానిక్ రాకీ’ నవంబర్ 22న థియేట్రికల్ రిలీజ్- అక్టోబర్ 20న ట్రైలర్ విడుదల

0
34
Mechanic Rocky From November 22nd 2024
Mechanic Rocky From November 22nd 2024

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, రవితేజ ముళ్లపూడి, రామ్ తాళ్లూరి, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘మెకానిక్ రాకీ’ నవంబర్ 22న థియేట్రికల్ రిలీజ్- అక్టోబర్ 20న ట్రైలర్ విడుదల

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మోస్ట్ ఎవైటెడ్ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ ‘మెకానిక్ రాకీ’తో అలరించడానికి రెడీగా వున్నారు. ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ఇంట్రస్టింగ్ టీజర్‌తో చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. మొదటి రెండు పాటలకు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి  SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మిస్తున్నారు.

ఈ రోజు సినిమా విడుదల తేదీకి సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. మెకానిక్ రాకీ నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది.

రిలీజ్ డేట్ పోస్టర్‌లో విశ్వక్ సేన్ ఇంటెన్స్ ఎక్స్ ప్రెషన్ తో కనిపించారు. మీనాక్షి సాంప్రదాయ చీరలో, శ్రద్ధా మోడరన్ అవుట్ ఫిట్ లో ఆకట్టుకున్నారు. మెకానిక్ రాకీ ట్రైలర్‌ను ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు పోస్టర్ లో తెలియజేశారు మేకర్స్.

ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. మనోజ్ కటసాని డీవోపీ గా పనిచేస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్.

తారాగణం: విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి
నిర్మాత: రామ్ తాళ్లూరి
ప్రొడక్షన్ బ్యానర్: SRT ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: జేక్స్ బిజోయ్
డీవోపీ: మనోజ్ కటసాని
ప్రొడక్షన్ డిజైనర్: క్రాంతి ప్రియం
ఎడిటర్: అన్వర్ అలీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: సత్యం రాజేష్, విద్యాసాగర్ జె
పీఆర్వో:  వంశీ-శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here