అక్టోబర్ 16 న నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను #BB4 గ్రాండ్ లాంచ్

0
38
Nandamuri Balakrishna - Boyapati Sreenu - #BB4 - 14 Reels
Nandamuri Balakrishna - Boyapati Sreenu - #BB4 - 14 Reels
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, రామ్ ఆచంట, గోపీ ఆచంట, 14 రీల్స్ ప్లస్, ఎమ్ తేజస్విని నందమూరి ప్రెజెంట్స్ #BB4 అక్టోబర్ 16న ఉదయం 10 గంటలకు గ్రాండ్ ఓపెనింగ్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌లను పూర్తి చేసి ఇండియన్ సినిమా క్రేజీ కాంబినేషన్‌లలో ఒకటిగా నిలిచారు. అత్యధిక వసూళ్లు రాబట్టిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలతో హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌లను అందించిన తర్వాత ఈ మ్యాసీవ్ ఎపిక్ కాంబో మళ్లీ చేతులు కలిపింది. 
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో #BB4 చిత్రం NBK పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ‘లెజెండ్’ నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై #BB4ని భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఎం తేజస్విని నందమూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
అక్టోబర్ 16 న #BB4 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరగనున్నట్లు దసరా శుభ సందర్భంగా మేకర్స్ అనౌన్స్ చేశారు. లాంచింగ్ రోజు సినిమాకి సంబధించిన మరిన్ని వివరాలను తెలియజేయనున్నారు. 
#BB4 అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో,  హై బడ్జెట్‌తో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా తెరకెక్కనుంది. #BB4 ఇప్పటివరకు బాలకృష్ణకు మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీ.  
నటీనటులు: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట
బ్యానర్: 14 రీల్స్ ప్లస్
ప్రజెంట్స్: ఎం తేజస్విని నందమూరి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here