హీరో నితిన్ లాంచ్ చేసిన శివకార్తికేయన్, సాయి పల్లవి, రాజ్‌కుమార్ పెరియసామి, ఆర్‌కెఎఫ్‌ఐ & సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ ‘అమరన్’ మెలోడియస్ ఫస్ట్ సింగిల్ ‘హే రంగులే’ సాంగ్   

0
141
'Amaraan' Melodious First Single 'Hey Rangale' Song Launched by Hero Nithin
'Amaraan' Melodious First Single 'Hey Rangale' Song Launched by Hero Nithin
హీరో నితిన్ లాంచ్ చేసిన శివకార్తికేయన్, సాయి పల్లవి, రాజ్‌కుమార్ పెరియసామి, ఆర్‌కెఎఫ్‌ఐ & సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ ‘అమరన్’ మెలోడియస్ ఫస్ట్ సింగిల్ ‘హే రంగులే’ సాంగ్   
ప్రిన్స్ శివకార్తికేయన్ మల్టీలింగ్వల్ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సాయి పల్లవి ఫిమేల్ లీడ్ గా నటిస్తున్నారు. 
ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘హే రంగులే’ సాంగ్ ని హీరో నితిన్ లాంచ్ చేశారు. సెన్సేషనల్ కంపోజర్ జి వి ప్రకాష్ ఈ సాంగ్ ని లవ్లీ మెలోడియస్ సాంగ్ గా కంపోజర్ చేశారు. 
సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ లీడ్ పెయిర్ కెమిస్ట్రీ ని అద్భుతంగా ప్రజెంట్ చేశాయి. అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా తమ లైవ్లీ వోకల్స్ తో కట్టిపడేశారు. ఈ సాంగ్ లో శివకార్తికేయన్, సాయి పల్లవి క్యారెక్టర్స్  లైఫ్ జర్నీ బ్యూటీఫుల్ గా వుంది. ‘హే రంగులే’ ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.  
టాప్  టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తోంది. జి వి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నారు, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవ్, సినిమాటోగ్రాఫర్ సిహెచ్ సాయి, ఎడిటర్ ఆర్. కలైవానన్, అన్బరివ్ మాస్టర్స్‌తో పాటు స్టీఫన్ రిక్టర్ యాక్షన్ డైరెక్టర్లు గా వున్నారు. 
ఈ మూవీ శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన “ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్” అనే పుస్తకంలోని “మేజర్ వరదరాజన్” చాప్టర్ ఆధారంగా రూపొందించారు. 
అమరన్ ఈ దీపావళికి అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here