జ్యోతి పూర్వజ్, లీడ్ రోల్ లో దర్శకుడు పూర్వాజ్ రూపొందిస్తున్న “కిల్లర్” మూవీ మోషన్ గ్రాఫిక్ పోస్టర్ లాంఛ్

0
111

జ్యోతి పూర్వజ్, లీడ్ రోల్ లో దర్శకుడు పూర్వాజ్ రూపొందిస్తున్న “కిల్లర్” మూవీ మోషన్ గ్రాఫిక్ పోస్టర్ లాంఛ్

పలు సూపర్ హిట్ సీరియల్స్, సినిమాల్లో నటించి పాన్ ఇండియా వీక్షకుల ఆదరణ పొందడంతో పాటు సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ జ్యోతి పూర్వజ్. ఆమె ,మాధవ్ ప్రధాన పాత్రలో “శుక్ర”, “మాటరాని మౌనమిది”, “ఏ మాస్టర్ పీస్” వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్, “కిల్లర్” అనే సెన్సేషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని అనౌన్స్ చేశారు. ఈ రోజు “కిల్లర్” పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ టైటిల్‌తో పాటు మోషన్ పోస్టర్‌ను లాంచ్ చేశారు మేకర్స్.

పవర్‌ఫుల్ లేడీ, గన్, చెస్ కాయిన్స్ తో ఆల్ట్రా మోడరన్ గా డిజైన్ చేసిన “కిల్లర్” మూవీ మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. MergeXR సంస్థతో కలిసి “Think Cinema’s” బ్యానర్ పై పూర్వాజ్, ప్రజయ్ కామత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది వారి రెండవ సహకారం. Poorvaaj,Shiva Madhav “కిల్లర్” చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు.

నటీనటులు:

జ్యోతి పూర్వజ్, శివ మాధవ్, పూర్వాజ్. అదనపు ప్రధాన పాత్రలు త్వరలో ప్రకటిస్తారు.

టెక్నికల్ టీమ్:

సినిమాటోగ్రఫీ: జగదీశ్ బొమ్మిశెట్టి

మ్యూజిక్: అషీర్ ల్యూక్, సుమన్ జీవ రత్నం

వీఎఫ్ఎక్స్, వర్చువల్ ప్రొడక్షన్: మెర్జ్ ఎక్స్ ఆర్

పీఆర్ఓ: GSK Media (సురేష్ – శ్రీనివాస్)

బ్యానర్లు: థింక్ సినిమా, మెర్జ్ ఎక్స్ ఆర్

నిర్మాతలు: పూర్వాజ్, ప్రజయ్ కామత్

రచన, దర్శకత్వం: పూర్వాజ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here