‘మత్తువదలరా2’ కు మేము ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది: డైరెక్టర్ రితేష్ రానా
శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్ లో రితేష్ రానా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిలేరియర్స్ థ్రిల్లర్ ‘మత్తువదలరా2’. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించారు. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 13న విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షుకులని అలరించిన హిలేరియస్ బ్లాక్ బస్టర్ ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ రితేష్ రానా విలేకరలు సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
‘మత్తువదలరా2’తో పెద్ద హిట్ కొట్టారు.. కంగ్రాట్యులేషన్స్
-థాంక్ యూ
చిరంజీవి గారు, మహేష్ బాబు గారు అప్రిషియేట్ చేయడం ఎలా అనిపించింది. బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు ?
-బెస్ట్ కాంప్లిమెంట్ అంటే.. టీం అంతా హ్యాపీ గా వుంది. అది చాలా సంతోషాన్ని ఇచ్చింది. నెక్స్ట్ చిరంజీవి గారు ట్వీట్ చాలా హ్యాపీనెస్ ఇచ్చింది.
సీక్వెల్ చేయాలనే ఆలోచన మొదటి నుంచి ఉందా ?
-సీక్వెల్ చేయాలని చెర్రీగా ఎప్పటినుంచో అన్నారు. అయితే ఆర్గానిక్ గా ఓ మంచి ఐడియా వస్తేనే చేయాలి. అలాంటి ఐడియా క్రాక్ చేసి చెర్రీగారికి, టీంకి చెప్పాను. అది అందరికీ నచ్చింది. మేము అనుకున్నట్లే వర్క్ పుట్ అయ్యింది. ఆడియన్స్ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
ఖుషి రిఫరెన్స్ తీసుకొని అజయ్ క్యారెక్టర్ చేయాలనే ఐడియా ఎవరిది ?
-నాదే. ఆ క్యారెక్టర్ గ్రో చూపించాలనేది ఐడియా. వున్న మూడు నిమిషాల్లో ఆయన క్యారెక్టర్ ఎస్టాబ్లెస్ చేయాలనుకున్నపుడు ఆయన చేసిన పాత సినిమాని వాడాలకున్నాను. అలా చూసిన వెంటనే ఆడియన్స్ కనెక్ట్ అవుతారనేది ఆలోచన.
సత్య చేసిన పదహారేళ్ళ వయసు సాంగ్ ముందే ప్లాన్ చేశారా ?
-అది ఫస్ట్ పార్ట్ లో తీసింది. అప్పుడు లెంత్ ఎక్కువైయిందని కట్ చేశాం. సెకండ్ పార్ట్ లో మళ్ళీ అలాంటి సిట్యువేషన్ వచ్చినపుడు అది ప్లేస్ చేశాం. థియేటర్స్ లో చాలా ఎంజాయ్ చేస్తున్నారు.
స్లేవ్ డ్రగ్ కాన్సెప్ట్ ఏమిటి ?
–స్లేవ్ డ్రగ్ ని ఒక మెటాఫర్ లా వాడం. మత్తు అనేది కేవలం నార్కోటిక్స్ నే కాదు. మత్తు చాలా రకాలుగా వుంది. ముత్తు నుంచి బయటపడటం మంచిదని చెప్పడం దాని ఉద్దేశం.
సింహ, సత్య క్యారెక్టరైజేషన్ గురించి ?
-బాబు, యేసు ఈక్వెల్ క్యారెక్టరైజేషన్స్. బాబు లేకపోతే యేసు క్యారెక్టర్ అంతగా పండదు. ఇద్దరూ కాంప్లమెంట్ చేసుకుని యాక్ట్ చేసే క్యారెక్టర్స్ అవి.
-ఫారియా కూడా అద్భుతంగా చేశారు. ఆమెని ద్రుష్టిలో పెట్టుకునే ఆ క్యారెక్టర్ రాశాను. తను ఈ సినిమాకి ఒక ర్యాప్ సాంగ్ చేశారు. అది మూవీ ప్రమోషన్స్ కి యూజ్ అయ్యింది.
హీటీంని ఎలా డిజైన్ చేశారు ? ఏదైనా సినిమా రిఫరెన్స్ తీసుకున్నారా ?
-హీ టీం డ్రెస్ కోడ్ లో బ్యాడ్ బాయ్స్, Brooklyn Nine-Nine రిఫరెన్స్ తీసుకున్నాం. బడ్డీ కాప్ జోనర్ తెలుగులో లేదు. లుక్ వైజ్ కొంచెం డిఫరెంట్ గా చేద్దామనేది హోల్ ఐడియా.
చెర్రీగారి వర్క్ ఎక్స్ పీరియన్స్ గురించి ?
వెరీ హ్యాపీ. ఇప్పటివరకూ అన్నీ సినిమాలు ఆయనతోనే చేశాను, జస్ట్ లైక్ ఏ ఫాదర్ ఫిగర్. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే సెకండ్ పార్ట్ కి ఎక్కువ బడ్జెట్ అయ్యింది. ఎక్కడ రాజీపడకుండా సినిమాని నిర్మించారు.
రాజమౌళి గారి రియాక్షన్ ఏమిటి ?
-రాజమౌళి గారికి సినిమా చాలా నచ్చింది. చాలా ఎంజాయ్ చేశారు.
సినిమాకి మ్యూజిక్ చాలా హెల్ప్ అయ్యింది కదా,. మీరు ఎలాంటి ఇన్ పుట్స్ ఇచ్చారు?
-కాల భైరవతో మంచి సింక్ కుదిరిపోయింది. ఇన్ పుట్స్ ఏమీ ఇవ్వను. నేను సినిమా రీల్స్ పంపిస్తా. తను మ్యూజిక్ చేసి పిలుస్తారు.
పార్ట్ 3 ఎప్పుడు ?
-ఐడియాస్, ప్లేస్ మెంట్స్ వున్నాయి. వాటిని ఇంకా డెవలప్ చేయాలి. ఇంకో సినిమా చేసిన తర్వాత పార్ట్ 3 వుంటుంది. నెక్స్ట్ సినిమా కూడా చెర్రీ గారితోనే చేస్తాను.
ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ