స్టార్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా చేతుల మీదుగా వేదిక సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ “ఫియర్” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

0
242
Vedhika's Suspense Thriller
Vedhika's Suspense Thriller "Fear" First Look Poster Released by Star Director and Choreographer Prabhu Deva

స్టార్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా చేతుల మీదుగా వేదిక సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ “ఫియర్” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “ఫియర్”. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు Dr. హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. “ఫియర్” సినిమా విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 60 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

ఈ రోజు “ఫియర్” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను స్టార్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తికరంగా ఉందన్న ఆయన చిత్ర యూనిట్ కు బెస్ట్ విశెస్ అందజేశారు. ఒక చీకటి గదిలో హీరోయిన్ భయపడుతూ చూస్తున్న స్టిల్ తో డిజైన్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో రూపొందిన “ఫియర్” సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.

నటీనటులు – వేదిక, అరవింద్ కృష్ణ, జెపి ( జయప్రకాష్ ), పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు

టెక్నికల్ టీమ్

మ్యూజిక్ – అనూప్ రూబెన్స్,
సినిమాటోగ్రఫీ – ఐ ఆండ్రూ
లిరిక్స్ – కృష్ణ కాంత్
కొరియోగ్రఫీ – విశాల్
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా(సురేష్ – శ్రీనివాస్)
డిజిటల్ మీడియా – హౌస్ ఫుల్, మాయాబజార్
నిర్మాత – ఏఆర్ అభి
కో ప్రొడ్యూసర్ – సుజాత రెడ్డి
రచన, ఎడిటింగ్, దర్శకత్వం – Dr. హరిత గోగినేని

Click Here To Read – Telusu Kada First Schedule Warpped Up

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here