“గదాధారి హనుమాన్” గా వస్తున్న విరభ్ స్టూడియోస్ నూతన చిత్రం

0
57
Virabh Studios-
Virabh Studios-"Gadadhari Hanuman"

 “గదాధారి హనుమాన్” గా వస్తున్న విరభ్ స్టూడియోస్ నూతన చిత్రం

టాలీవుడ్ సినీ పరిశ్రమ ఎప్పుడు కొత్త సినిమాలని, కొత్త ప్రొడక్షన్ హౌసెస్ ని స్వాగతిస్తూ సరికొత్త టాలెంట్ ని పరిచయం చేస్తూనే ఉంటుంది. ఈ సారి ఒక సరికొత్త కాన్సెప్ట్ తో నూతన ప్రొడక్షన్ హౌస్ విరభ్ స్టూడియోస్ సమర్పణ లో టాలెంటెడ్ డైరెక్టర్ రోహిత్ కొల్లి ని పరిచయం చేస్తూ తన మొదటి సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసింది. అదే ” గదాధారి హనుమాన్ “. ఈ చిత్రం మొత్తం మూడు బాషలలో (తెలుగు, కన్నడ మరియు హిందీ) లో రిలీజ్ చేస్తునట్టు చిత్ర బృందం తెలిపింది.

“గదాధారి హనుమాన్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా ఉంటుందని. కచ్చితంగా ఆడియన్స్ థియేటర్ నుండి బయటకి వచ్చినప్పుడు ఒక సరికొత్త అనుభూతి తో వస్తారని చాల కాన్ఫిడెంట్ గా ఉన్నామని అంతే కాకుండా ఈ చిత్రాన్ని చాలా జాగ్రత్తగా తీశామని ప్రొడ్యూసర్స్ బసవరాజు హురకదలి & రేణుక ప్రసాద్ కే.అర్” తెలిపారు.  Read “Gadadhari Hanuman” English Article Here >>

*”గదాధారి హనుమాన్ సినిమాని ఆధ్యంతం అన్ని అంశాలు జోడించి ఒక డివైన్ టచ్ చాలా అద్భుతంగా తీశామని. రేపు ఆడియన్స్ కూడా మా సినిమా చూసి ఒక కల్కి ,హనుమాన్ లాంటి సూపర్ బ్లాక్ బస్టర్ ని మాకు కూడా ఇస్తారు అని పూర్తి నమ్మకం తో ఉన్నాం” అని ఫిలిం డైరెక్టర్ రోహిత్ కొల్లి అన్నారు.

గదాధారి హనుమాన్ టైటిల్ ని గమినించి నట్లైతే హనుమాన్ విజయ కేతనం తో ఉండే జెండా మరియు టైటిల్ చివరలో హనుమాన్ తోక ని కూడా జోడించారు. చూస్తుంటే ఈ సినిమాలో రావణ దహన సన్నివేశాలు లాంటివి కూడా ఉన్నట్లు అనిపిస్తుంది. ఏది ఏమైనా కొన్ని రోజులు వెయిట్ చేస్తే సినిమాకు సంబంధించిన మరెన్నో ఆసక్తికరమైన విషయాలు త్వరలోనే తెలియచేస్తాం అని గదాధారి హనుమాన్ టీం చెప్తుంది.

ఈ చిత్రంలో రవి, హర్షిత, బసవరాజు హురకదలి, రమేష్ పండిట్, నగేష్ మైయ్య, కళ్యాణ్ మరియు సునంద ప్రముఖ పాత్రలలో నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శర వేగంగా జరుగుతునాయి. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని నవంబర్ లో చిత్రాన్ని విడుదల చేసే సన్నాహాలు జరుగుతున్నాయి.

తారాగణం

రవి, హర్షిత, బసవరాజు హురకదలి, రమేష్ పండిట్, నగేష్ మైయ్య, కళ్యాణ్ మరియు సునంద

టెక్నికల్ టీం

డైరెక్టర్ : రోహిత్ కొల్లి
ప్రొడ్యూసర్స్ : బసవరాజు హురకదలి & రేణుక ప్రసాద్ కే.అర్
ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ : విరభ్ స్టూడియోస్
సినిమాటోగ్రఫీ : అరుణ్ గౌడ
ఎడిటర్ : సి .ఎన్ కిషోర్
మ్యూజిక్ : జుడా సందే
స్టంట్ మాస్టర్ : టైగర్ శివ
మేనేజర్స్ : మాధవ & మండ్య మంజు
పి ఆర్ ఓ : గౌతమ్ యర్రంశెట్టి
పబ్లిసిటీ డిజైన్ : రోడ్  సైడ్  విళ్లే

Virabh Studios-"Gadadhari Hanuman"
Virabh Studios-“Gadadhari Hanuman”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here