ఆసక్తిరేపేలా “భగవద్గీత” షార్ట్ ఫిల్మ్ 

0
220
BhagavadGeetha Short Film
BhagavadGeetha Short Film

ఆసక్తిరేపేలా భగవద్గీత షార్ట్ ఫిల్మ్

'Bhagavadgeetha' Short Film
‘Bhagavadgeetha’ Short Film – Directed By Suresh Srinivas
యుట్యూబ్ లో అనేక షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లు చేసి మంచి పేరు తెచ్చుకున్న రవితేజ మహాదాస్యం ఈమధ్యనే టాలీవుడ్ హీరో కూడా అయ్యాడు. అయినా మూలాలు మరువకుండా అవకాశం వచ్చినప్పుడు డిజిటల్ లో కనిపించడానికి ఏమాత్రం మొహమాట పడడం లేదు. తాజాగా ఆయన భగవద్గీత అనే ఒక షార్ట్ ఫిల్మ్ లో అర్జున్ అనే యాస్పైయిరింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గా నటించాడు. రిజెక్షన్లు ఎదుర్కుంటూ ఎదుర్కుంటూ ఫ్రస్ట్రేట్ అవుతున్న అర్జున్ కి దేవుడు చేప రూపంలో కనిపిస్తాడు. తన ఇంట్లోనే పెంచుకునే చేప అర్జున్ కి శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసినట్టు చేయడం ఆసక్తి రేకెత్తించింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ చేపకు స్టార్ యాక్టర్ అజయ్ ఘోష్ వాయిస్ ఓవర్ అందించడం. సురేష్ శ్రీనివాస్ రాసి డైరెక్ట్ చేసిన ఈ షార్ట్ ఫిల్మ్ కి శ్రీనివాస్ బెజుగాం డెరైక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా వ్యవహరించాడు. నిజానికి సురేష్ శ్రీనివాస్ ఈ మధ్యనే రిలీజై ప్రేక్షకుల మన్ననలు అందుకున్న మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఈ సినిమా ధియేటర్లలో దుమ్ము దులిపేసి ఆ తరువాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో చాలా రోజులు ట్రెండింగ్ లో కూడా ఉంది. ఆ సినిమాకి పనిచేసినప్పటి పరిచయంతో పాటు కాన్సెప్ట్ నచ్చడంతో కోరిన వెంటనే అజయ్ ఘోష్ వెంటనే వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. అది షార్ట్ ఫిల్మ్ కి మరింత ప్లస్ పాయింట్ అయింది. ఇక అడుపా నరేష్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టిన ఈ షార్ట్ ఫిల్మ్ కి సృజన్ శశాంక మ్యూజిక్ అందిస్తూనే సౌండ్ మిక్సింగ్ కూడా చూసుకున్నారు. ఇక తామాడా మీడియా ఈ షార్ట్ ఫిల్మ్ ను ప్రేక్షకుల ముందుకి తీసుకు వచ్చింది.

Wacth “Bhagavadgeetha” Short Film Here <<<

Bhagavadgeetha Short Film English Article Read Here <<<

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here