**
టాలీవుడ్‌లో ప్రస్తుతం యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ల హవా నడుస్తోంది. కొత్త కాన్సెప్టులతో కొత్త దర్శకులు ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో యువ దర్శకుడు అప్సర్ ముందున్నారు. గంధర్వతో వినూత్నమైన యాంటీ ఏజింగ్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఇప్పుడు అశ్విన్ బాబు నటించిన శివం భజేతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఆగస్ట్ 1న విడుదలైన ఈ చిత్రానికి అంతటా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
అశ్విన్ బాబు గత చిత్రం హిడింబ విజయం సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్న సంగతి తెలిసిందే. శివం భజే చిత్రాన్ని ఒక యూనిక్, డివోషనల్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. మాస్‌ను మెప్పించే యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ ఇలా అన్ని జానర్లను మిక్స్ చేసి తీసిన ఈ సినిమాకు ఫుల్ పాజిటివ్ స్పందన వస్తోంది.
అప్సర్ దర్శకత్వం, మేకింగ్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ఎంటర్టైన్, ఎంగేజ్ చేయడంలో అప్సర్ పాస్ అయ్యాడని ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాతో అప్సర్ కాంప్లెక్స్ సబ్జెక్ట్‌లను కూడా ఎంతో సులభంగా, తన టాలెంట్‌తో తీయగలడని నిరూపించుకున్నారు. అతని రైటింగ, మేకింగ్, టేకింగ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ చిత్రాన్ని మహేశ్వర్ రెడ్డి నిర్మించగా, మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసింది.