చిత్రం: శివమ్ భజే
విడుదల తేదీ: 01-08-2024
నటినటులు:అశ్విన్ బాబు, దిగంగగనా సూర్యవంశీ, అర్బాజ్ ఖాన్, తదితరులు
దర్శకత్వం:అబ్దుల్ అప్సర్ హుస్సేన్
నిర్మాత:మహేశ్వర రెడ్డి మూలి
సంగీతం:వికాస్ బడిస
సినిమాటోగ్రఫీ:దాశరథి శివేంద్ర
సస్పెన్స్ థ్రిల్లర్స్ కి అడ్రస్ గా మారుతున్న అశ్విన్ బాబు హిడింబ తర్వాత హీరో గా నటించిన మూవీ శివం భజే. టీజర్,ట్రైలర్ ఎంత ఇంటరెస్టింగ్ గా ఉన్నాయో మూవీ కూడా అంతే ఇంటరెస్టింగ్ గా సాగుతుంది.
ఇండస్ట్రీ లో తన మార్క్ ని క్రియేట్ చేయాలనుకుంటున్న అశ్విన్ బాబు కి ఇది దారి వేసే మూవీ అని చెప్పచ్చు. గంగా ఎంటర్టైన్మంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో అప్సర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశీ లీడ్స్. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్, సాయి ధీనా, హైపర్ ఆది, మురళీ శర్మ, బ్రహ్మాజీ.. పలువురు కీలక పాత్రలు పోషించారు. ‘శివం భజే’ సినిమా నేడు ఆగస్టు 1న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజయింది.
కథ:
ఇక కథ విషయానికి వస్తే, హీరో చందూ (అశ్విన్ బాబు) లోన్ రికవరీ ఏజెంట్. చిన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయినప్పటి నుంచి దేవుడ్ని నమ్మడం మానేస్తాడు. లోన్ రికవరీ ప్రాసెస్ లో ఫార్మాసూటికల్ ల్యాబ్ లో పనిచేసే శైలజ (దిగంగన సూర్యవంశీ) పరిచయమయి తర్వత ప్రేమలో పడతారు. లోన్ రికవరీలో భాగంగా ఒకరితో గొడవ జరగడంతో ఆ గొడవలో చందు కళ్ళు పోతాయి. అయితే అదే సమయానికి ఎవరికో యాక్సిడెంట్ అయిందని వాళ్ళ కళ్ళు తీసుకొచ్చి చందుకు అమరుస్తారు. ఆ కళ్ళు అమర్చిన దగ్గర్నుంచి చందుకు యేవో జ్ఞాపకాలు గుర్తొస్తాయి. తన డైలీ లైఫ్ లో మార్పులు వస్తూ ఉంటాయి. దేవుడికి దండం పెట్టడం మొదలుపెడతారు. దీంతో డాక్టర్ దగ్గరికి వెళ్లడంతో మొదట పట్టించుకోరు. వేరే డాక్టర్ చందుని పరిశీలించి ఆపరేషన్ లో చందుకు కుక్క కళ్ళు అమర్చారని చెప్తాడు. అయితే అవి పోలీస్ ట్రైనింగ్ కుక్క డోగ్రె కళ్ళు అని తెలుస్తుంది. మరో వైపు చైనా పాకిస్థాన్ కలిసి ఇండియాని నాశనం చేయాలని ఓ కుట్ర పన్నుతుంటారు. మరో వైపు వరుసగా కొంతమంది చనిపోతూ ఉంటారు. అసలు ఆ కుక్క కథ ఏంటి? కుక్క కళ్ళు చందుకు ఎలా అమర్చారు? సీరియల్ కిల్లర్ ఎవరు? చైనా పాకిస్థాన్ చేసే ప్లాన్ ఏంటి? అసలు చందుకి శివుడికి, ఆ చైనా ప్లాన్ కి లింక్ ఏంటి? చనిపోయేవాళ్లు ఎవరు? తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
నటీనటుల పనితీరు:
అశ్విన్ బాబు థ్రిల్లర్ తరహా చిత్రాలకు చక్కగా సరిపోయే బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్ తో ఉండడం సినిమాకి కలిసొచ్చింది. దిగంగన కూడా చూడడానికి బాగుంది బాగా నటించింది. పోలీస్ ఆఫీసర్ మురళి పాత్రలో నటించిన అర్భాజ్ ఖాన్ ఆకట్టుకున్నారు. ఇక మురళీశర్మ, తనికెళ్ళ భరణి వంటి చాలా మంది సీనియర్ నటులు వాళ్ళ పరిధిమేర నటించారు.
విశ్లేషణ:
థ్రిల్లర్ ని కొత్త యాంగిల్ లో చూయించారు.ఫస్ట్ హాఫ్ హీరో, హీరోయిన్ ప్రేమ, హీరో గురించి సాగుతూ సింపుల్ అండ్ క్యూట్ గా అన్పిస్తుంది. సరదాగా సాగిపోయే మూవీలానే అనిపిస్తుంది. మధ్యలో చైనా, పాకిస్థాన్, ఆపరేషన్ దలైలామా అంటూ ఓ సీక్వెన్స్ సపరేట్ గా నడుస్తున్నా అది అండర్ ప్లేలోనే సాగుతూ, హీరో క్యారెక్టరైజేషన్ పవర్ఫుల్ అవుతూ ఉంటుంది. సరిగ్గా ఇక్కడే లవ్ ట్రాక్ వర్కౌట్ కావడం, హైపర్ ఆది కామెడీ పంచ్ లు బాగా పేలడంతో మూవీ సరైన ట్రాక్ లోనే ఉంది అనిపిస్తుంది. ఇక హీరోకి గొడవలో కంటి చూపు పోయాక అసలు కథ మొదలవుతుంది. అయితే.. హీరోకి పెట్టింది ఎవరి కళ్ళు అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ రివీల్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకుంటుంది.
సెకండ్ ఆఫ్ లో ఒక రేంజ్ కి వెల్తుంది.అందుకు కావాల్సిన స్టోరీ పోగ్రెషన్ అంతా దర్శకుడు ముందుగానే సెట్ చేశాడు. ఇక చివరలో డివోషనల్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. డైరెక్టర్ అప్సర్ స్టోరీ నీ తీసుకువెళ్ళిన విధానం, స్క్రీంప్లే చాలా ఇంప్రెస్సివ్.స్టార్ కాస్ట్ అద్భుతంగా సెట్ అయింది. ఇలా సినిమాకి అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరాయి.
సాంకేతిక నిపుణుల పనితీరు:
ఇక సినిమాలో దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. వికాస్ బడిస సంగీతం సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది. ముఖ్యంగా బీజీఎమ్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది . చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. ఓవరాల్ గా ఈ క్రైమ్ డ్రామా కి చప్పట్లు తప్పనిసరి. క్రైమ్ థ్రిల్లర్స్ ని ఎంజాయ్ చేసే ఆడియన్స్ కి పండగే.
రేటింగ్: 3.25/5
చివరగా: డివోషనల్ యాంగిల్ తో థ్రిల్లింగ్ గా సాగే ‘శివమ్ భజే ‘