హీరో విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్

0
74

‘మెకానిక్ రాకీ’ మంచి రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్. చాలా ఎంటర్ టైన్ చేస్తుంది. దీపావళి క్రాకర్ అవుతుంది: గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో హీరో విశ్వక్ సేన్


విశ్వక్ సేన్, రవితేజ ముళ్లపూడి, రామ్ తాళ్లూరి, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ మెకానిక్ రాకీ ఎంటర్టైనింగ్ యాక్షన్-ప్యాక్డ్ గ్లింప్స్ లాంచ్

టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’గా ఆలరించబోతున్నారు. ఈ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌ను నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించారు. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ని మేకర్స్ ఈరోజు లాంచ్ చేశారు.

విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్  ట్రయాంగిల్ లవ్ ట్రయాంగిల్‌ను ప్రజెంట్ చేస్తూ..  సినిమాలోని కీలక పాత్రలను రివిల్ చేసేలా ఫస్ట్ గేర్ డిజైన్ చేశారు. ఈ గ్లింప్స్ ఎట్రాక్టివ్ ఎంటర్ టైన్మెంట్, డైనమిక్ యాక్షన్ సన్నివేశాలతో అదిరిపోయింది.

మెకానిక్ రాకీ గా విశ్వక్ సేన్ మ్యాసీవ్, ఇంటెన్స్ గా కనిపించారు. విశ్వక్ సేన్ చెప్పిన “ఛోటే చోటే బచ్చో కో పూరోన్ కి మై జవాబ్ దేథూ…”హిందీ డైలాగ్ అదిరిపోయింది, బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే “డేంజర్ కే లైసెన్సు వీడు” అనే డైలాగ్ కూడా పవర్ ఫుల్ గా వుంది.

మీనాక్షి చౌదరి ఎత్నిక్ వేర్ లో కూల్ గా కనిపించింది. శ్రద్ధా శ్రీనాథ్ అర్బన్ లేడీ క్యారెక్టర్ లో ఆకట్టుకుంది. L బోర్డ్ సీక్వెన్స్ హిలేరియస్ గా వుంది. సునీల్, నరేష్,  రోడీస్ రఘు రామ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించారు.

రవితేజ ముళ్లపూడి అన్ని ఎలిమెంట్స్ తో కూడిన సబ్జెక్ట్‌ని ఎంచుకుని విశ్వక్ సేన్ పాత్రను అద్భుతంగా ప్రెజెంట్ చేశాడు. మనోజ్ కటసాని కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది, జేక్స్ బెజోయ్ ఫంకీ BGM ఎంటర్టైమెంట్ ని ఎలివేట్ చేసింది. ప్రొడక్షన్  వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి. మొత్తానికి ఫస్ట్ గేర్ సినిమాపై  క్యురియాసిటీని పెంచింది. ఈ చిత్రానికి అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్,  విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. మెకానిక్ రాకీ దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల కానుంది.

గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. అందరికీ బోనాలు పండగ శుభాకాంక్షలు. ఇది జస్ట్ గ్లింప్స్ మాత్రమే. ఈ ఏడాది చాలా స్పెషల్. మూడో సినిమా కూడా రాబోతోంది. మెకానిక్ రాకీ అవుట్ పుట్ ఇంత గ్రాండ్ గా రావడానికి కారణం నిర్మాత రామ్ తాళ్లూరి గారు. ఆయన లేకపోతే ఇంత పాజిబుల్ అయ్యేది కాదు. రవితేజ చాలా ట్యాలెంటెడ్. సినిమా మీద పాషన్ తో వచ్చారు. సినిమాని చాలా అద్భుతంగా తీశారు. మనోజ్ ఇండియాలో టాప్ డీవోపీ అవుతాడు. శ్రద్దా కెరీర్ లో ఇది బెస్ట్ లుక్ అనిపించింది. మంచి క్యారెక్టర్. ఇది బ్యూటీఫుల్ ట్రైయాంగిల్ లవ్ స్టొరీ. మీనాక్షి వండర్ ఫుల్ కో స్టార్. తనకి గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుతుంది. జేక్స్ బిజోయ్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. ప్రతి సాంగ్ బ్లాక్ బస్టర్ అయ్యే ఆల్బం ఇచ్చాడు. చాలా న్యూ ఏజ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇది గ్లింప్స్ మాత్రమే. ముందుముందు చాలా రాబోతున్నాయి. మలక్ పేట్ బ్యాక్ డ్రాప్ వుండే కథ ఇది. నా క్యారెక్టర్ చాలా కనెక్టింగ్ వుంటుంది. చాలా మంచి కామెడీ టైమింగ్ వుంటుంది. మెకానిక్ రాకీ రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్. మెట్రో మాస్ అనుకోవచ్చు. చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా ఎంటర్ టైన్ చేస్తుంది. ఇది దీవాళి క్రాకర్ అవుతుంది. అందరూ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి. అందరికీ థాంక్ యూ’ అన్నారు.

నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ.. మెకానిక్ రాకీ మంచి మాస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అక్టోబర్ 31న మీ ముందుకు వస్తున్నాం. మీ అందరూ ఎంజాయ్ చేస్తారు. రవితేజ కొత్త  దర్శకుడైన చాలా గొప్పగా తీశాడు. విశ్వక్ గారి ఎనర్జీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంచి రోల్ చేస్తున్నారు. మీ అందరికీ నచ్చుతుంది’ అన్నారు

హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. మీ అందరికీ ప్రేమకి థాంక్ యూ. మీ అందరికీ గ్లింప్స్ నచ్చడం చాలా ఆనందంగా వుంది. ఇది జస్ట్ గ్లింప్స్ మాత్రమే. ఇంకా అద్భుతమైన కంటెంట్ రాబోతోంది. ఇందులో సాంగ్స్ సూపర్బ్ గా వుంటాయి. ఈ సినిమా తప్పకుండా మీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది. ఇందులో నేను చేస్తున్న క్యారెక్టర్ చాలా రిలేటబుల్ గా వుంది. మీ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు.

డైరెక్టర్ రవితేజ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మీ అందరికీ గ్లింప్స్ నచ్చిదని భావిస్తున్నాను. జేక్స్ బిజోయ్ వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత రామ్ తాళ్లూరి , హీరో విశ్వక్ గారికి థాంక్ యూ.  మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్,  నరేష్, సునీల్ గారు చాలా అద్భుతమైన యాక్టర్స్ వున్నారు. అందరికీ థాంక్ యూ’ అన్నారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

తారాగణం: విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి
నిర్మాత: రామ్ తాళ్లూరి
ప్రొడక్షన్ బ్యానర్: SRT ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: జేక్స్ బిజోయ్
డీవోపీ: మనోజ్ కటసాని
ప్రొడక్షన్ డిజైనర్: క్రాంతి ప్రియం
ఎడిటర్: అన్వర్ అలీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: సత్యం రాజేష్, విద్యాసాగర్ జె

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here