ఘనంగా ‘రామ్‌ ఎన్‌ఆర్‌ఐ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక.. జూలై 26న గ్రాండ్ రిలీజ్

0
41

**

బిగ్‌బాస్‌ ఫేమ్‌ అలీ రజా కథానాయకుడిగా, సీతా నారాయణన్‌ కథానాయికగా నటించిన చిత్రం ‘రామ్‌ ఎన్‌ఆర్‌ఐ’. ‘పవర్‌ ఆఫ్‌ రిలేషన్ షిప్‌’ అనేది ఈ చిత్రం ఉపశీర్షిక. ఈ చిత్రానికి ఎన్.లక్ష్మీ నందా దర్శకుడు. మువ్వా క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌ఎంకే ఫిల్మ్స్‌ సింగులూరి మోహన్‌కృష్ణ సమర్పణలో మువ్వా సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని జూలై 26న విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌కు ప్రసన్న కుమార్, లయన్ సాయి వెంకట్, రామకృష్ణ గౌడ్, రామసత్య నారాయణ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం..

*ప్రసన్న కుమార్ మాట్లాడుతూ..* ‘వీళ్లు సినిమా చేసే టైంకి కందుల దుర్గేశ్ గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయ్యారు. దగ్గుబాటి పురందేశ్వరి, కోమటిరెడ్డి గారి విషెస్ వీరికి ఉన్నాయి. సినిమా టీం ఎంతో కష్టపడి పని చేశారు. ఇంత మంచి టీం పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది’ అని అన్నారు.

*ఎన్.లక్ష్మీ నందా మాట్లాడుతూ..* ‘నాకు సపోర్ట్ చేసిన నా టీంకు ప్రత్యేకంగా థాంక్స్. పుట్టిన ఊరికి ఏదైనా చేయాలని కోరుకున్న వారంతా ముందుకు వచ్చి నా ఈవెంట్‌ను సక్సెస్ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.

*ఎస్‌ఎంకే ఫిల్మ్స్‌ సింగులూరి మోహన్‌కృష్ణ మాట్లాడుతూ..* ‘సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే అవకాశం ఇచ్చిన వారందరికీ థాంక్స్. నా మీద నమ్మకంతో నాకు ఈ చిత్రాన్ని ఇచ్చారు. జూలై 26న మా చిత్రం రాబోతోంది. ఉయ్యాల జంపాల, శతమానంభవతి ఫ్లేవర్ నాకు కనిపించింది. ఎస్‌ఎంకే ఫిల్మ్స్‌ బ్యానర్ మీద ఏడాదికి ఆరు చిత్రాలైనా రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను. ప్రతీ చిన్న చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించుకుంటున్నాను. లక్ష్మీ నందా గారితో ఓ సోలో చిత్రాన్ని చేస్తున్నాను. మా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాను’ అని అన్నారు.

*లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ..* ‘సినిమా నిర్మించడం కంటే.. విడుదల చేయడమే పెద్ద సాహసం. ఇదొక ఫీల్ గుడ్ మూవీ. లక్ష్మీ నందా ప్రాణం పెట్టి తీశాడు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. భారతదేశం నుంచి వెళ్లిన ఎన్‌ఆర్‌ఐల మీద అద్భుతంగా తీశాడు. విజువల్స్ బాగుంటాయి. మువ్వా సత్య నారాయణ గొప్పగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మోహనకృష్ణ నిర్మాతలకు గ్యాంగ్ లీడర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రం పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

*ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ..* ‘పాటలు, ట్రైలర్ అన్నీ బాగున్నాయి. ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది. మంచి లాభాలు వచ్చి ఇంకా మరిన్నిచిత్రాలను నిర్మించాలని కోరుకుంటున్నాను. ఆగిపోయిన సినిమాలను రిలీజ్ చేస్తానని మోహనకృష్ణ గారు అన్నారు. చాలా గొప్ప మాటలు చెప్పారాయన. మా సపోర్ట్ ఆయనకి ఉంటుంది’ అని అన్నారు.

*రామసత్యనారాయణ మాట్లాడుతూ..* ‘ఇది గోదారోళ్ల సినిమా. తూ.గో, ప.గో జిల్లాల వ్యక్తులంతా కలిసి చేశారు. గోదారోళ్లకు ఎంత వెటకారం ఉంటుందో.. ప్రేమ కూడా అంతే ఉంటుంది. గోదారి అందాలను మరింత అందంగా చూపించారు. ఈ చిత్రం పెద్ద సక్సెస్ అవుతుంది. మంచి చిత్రాన్ని తీశారు. ఇలాంటి సినిమాను సపోర్ట్ చేసేందుకు మేం అంతా ముందుకు వస్తామ’ని అన్నారు.

*నిర్మాత మువ్వా సత్యనారాయణ మాట్లాడుతూ..* ‘సినిమా చాలా బాగా వచ్చింది. చిత్రాన్ని చాలా ఎంజాయ్ చేస్తూ నిర్మించాం. ఈ మూవీ పెద్ద సక్సెస్ అవుతుందని భావిస్తున్నాం. మా సినిమాను అందరూ ఆదరించండి’అని అన్నారు.

*నటుడు రవి వర్మ మాట్లాడుతూ..* ‘డైరెక్టర్ ఈ కథ చెప్పినప్పుడు ఎంతో రిలేట్ అయ్యాను. పుట్టిన ఊరుకి ఏం చేశామని ఎంతో మంది అనుకుంటారు. అలాంటి పాయింట్‌ను తీసుకుని కథ చేయడం గొప్ప విషయం. ఈ కథ ఏ ఒక్కరికీ నచ్చినా ఎంతో కొంత మార్పు వస్తుంది కదా అని అనిపించింది. ఇలాంటి మంచి చిత్రంలో కచ్చితంగా నటించాలని కోరుకున్నాను. నిర్మాత మొవ్వా సత్యనారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అందరూ చూసి మా సినిమాను ఆధరించండి’ అని అన్నారు.

సినిమా ట్రైలర్ బాగుందని, కొత్త టీం కలిసి చేసిన ప్రయత్నం పెద్ద సక్సెస్ కావాలని, ఇలాంటి కొత్త వాళ్లు ఇండస్ట్రీలోకి ఇంకా రావాలని ఈవెంట్‌కు వచ్చిన ఇతర ముఖ్య అతిథులు, తదితరులు మాట్లాడుతూ సినిమా టీంకు విషెస్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here