టెర్రిఫిక్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో *”1000 వాలా”* టీజర్ విడుదల!!

0
49

 

సూపర్ హిట్ మూవీ మేకర్స్ పతాకంపై షారుఖ్ నిర్మాణంలో కత్తి లాంటి కొత్త కుర్రాడు “అమిత్” హీరోగా తెరంగ్రేటం చేస్తున్న చిత్రం “1000వాలా”. యువ ప్రతిభాశాలి అఫ్జల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అమిత్, షారుఖ్, నవిత, కీర్తి, సుమన్, పిల్లాప్రసాద్, ముఖ్తార్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది!!

ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. “మా 1000 వాలా చిత్రం టీజర్ సోషల్ మీడియా ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది. లైక్స్ మరియు కామెంట్స్ చూసి మా సినిమా తప్పక విజయం సాధిస్తుంది అనే నమ్మకం కలిగింది. త్వరలో విడుదల తేది ప్రకటిస్తాం” అని తెలిపారు!!

ఈ చిత్రానికి కథ :- అమిత్, పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, కథనం, మాటలు : గౌస్ ఖాజా, కెమెరా : చందు ఏజె, డి ఐ : రవితేజ, డాన్స్ : బాలు మాస్టర్ & సూర్య కొలుసు, ఫైట్స్ : డైనమిక్ మధు, సంగీతం : వంశీకాంత్ రేఖాన, నిర్మాత : షారుఖ్, దర్శకత్వం : అఫ్జల్!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here