నటీనటులు :
డార్లింగ్ కృష్ణ, మిలిన నాగరాజ్, అమృత అయ్యంగర్, రచల్ డేవిడ్, నకుల్ అభయాన్కర్
టెక్నికల్ టీం :
నిర్మాణం : కంచి కామాక్షి కోల్కతా కాళీ క్రియేషన్స్
నిర్మాత : ఎం వి ఆర్ కృష్ణ
మ్యూజిక్ : నకుల్ అభయాన్కర్
లిరిసిస్ట్ : గురు చరణ్
మ్యూజిక్ లేబుల్ : జాంకర్ మ్యూజిక్
డిఓపి మరియు ఎడిటర్ : శ్రీ క్రేజీ మైండ్స్
కథ మరియు దర్శకత్వం : డార్లింగ్ కృష్ణ
పి ఆర్ ఓ : మధు VR
కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ నిర్మాత రచయిత దర్శకుడు హీరో డార్లింగ్ కృష్ణ నటించిన లవ్ మోక్టైల్ 2. ఈ సినిమాకు సంగీత దర్శకుడు నకుల్ అభయాన్కర్ మంచి మ్యూజిక్ అందించాడు. మిలిన నాగరాజ్, అమృత అయ్యంగర్, రచల్ డేవిడ్, నకుల్ అభయాన్కర్ ముఖ్య పాత్రలు పోషించారు. నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ విషయానికొస్తే : లవ్ మోక్టైల్ కి కంటిన్యూషన్ గా వస్తోంది ఈ సినిమా. ఆది (డార్లింగ్ కృష్ణ) భార్య నిధి (మిలినా నాగరాజ్) చనిపోతుంది. ఎప్పుడూ తన భార్య ఆలోచనలతోనే ఉండే ఆది ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావడం కోసం అరకు ట్రావెల్ చేస్తాడు. అలా చేస్తున్న క్రమంలో తన భార్య తనతోనే ఉందని ఊహించుకుంటూ ఉంటాడు. తనను ఇష్టపడే అమ్మాయిలు తన వెంట పడుతున్న వారిని పట్టించుకోడు. కానీ తన భార్య తన పక్కనే ఉంటున్నటుహించుకుంటున్న హీరో కి పెళ్లి చేయాలని చూస్తుంది. చివరికి హీరో ఇంకో పెళ్లి చేసుకున్నాడా, లేదా? బంధాలకు చేసుకున్న వివాహానికి విలువిచ్చే హీరో క్లైమాక్స్ లో ఏం చేశాడు? తెలియాలంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే?
గతంలో లవ్ మోక్టెల్ తో హిట్టు కొట్టిన డార్లింగ్ కృష్ణ తనే నిర్మాతగా దర్శకుడిగా వ్యవహరిస్తూ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా నటించాడు. నిధి క్యారెక్టర్ లో మిలిన నాగరాజ్ నటన చాలా బాగుంది. రచల్ డేవిడ్, నకుల అభయాన్కర్, అమృత అయ్యంగర్, సుస్మిత గౌడ, అభిలాష్ ఎవరి పాత్రకి వాళ్లు న్యాయం చేశారు.
టెక్నికల్ టీం : కన్నడలో బ్లాక్బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాని కంచి కామాక్షి కోల్కతా కాళీ క్రియేషన్స్ పై ఎం వీ ఆర్ కృష్ణ గారు తెలుగు ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు. డబ్బింగ్ సినిమా ల కాకుండా టెక్నికల్ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు. నకుల్ నకుల అభయాన్కర్ ఇచ్చిన మ్యూజిక్ అండ్ సాంగ్స్ సినిమాకి హైలైట్. శ్రీ క్రేజీ మైండ్స్ సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ చాలా బాగున్నాయి. మంచి కథ నేర్చుకుని దర్శకత్వ విలువలతో డార్లింగ్ కృష్ణ ఒక మంచి ఫ్యామిలీ లవ్ స్టోరీ ని తీసుకుని వచ్చారు.
ప్లస్ పాయింట్స్ : డార్లింగ్ కృష్ణ కథ, నటన
మిగిలిన నాగరాజ్, అభిలాష్, రచల్ డేవిడ్ క్యారెక్టర్స్
నకుల్ అభయాన్కర్ సంగీతం
సెకండ్ హాఫ్ మరియు క్లైమాక్స్
మైనస్ పాయింట్స్ : ఫస్ట్ ఆఫ్ లో లాగ్ సీన్స్
నవ్వించలేని కామెడీ
రేటింగ్ : 3/5
యూత్ ఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్



