హారర్, కామెడీ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి ఆధరణ ఎప్పుడూ ఉంటుంది. థియేటర్లో అయినా,ఓటీటీలో అయినా ఈ జానర్‌ను ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందుకే హారర్, కామెడీ చిత్రాలను తెరకెక్కించేందుకు మేకర్లు ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. ఇక ఈ క్రమంలోనే మార్క్‌సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్‌పై శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో ‘ఓ మంచి ఘోస్ట్’ అనే చిత్రం రాబోతోంది.
ఈ చిత్రంలో ప్రముఖ కమీడియన్ వెన్నెల కిషోర్, నందితా శ్వేత, షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, హాస్యనటుడు రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. డా.అబినికా ఇనాబతుని నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం నిర్మించగా.. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్, లిరికల్ సాంగ్, టీజర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
‘ఓ మంచి ఘోస్ట్’ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. జూన్ 14న ఈ చిత్రం థియేటర్లోకి రాబోతోంది. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో వెన్నెల కిషోర్, నందితా శ్వేత, షకలక శంకర్, నవమి గాయక్ వంటి వారు కనిపిస్తున్నారు. చూస్తుంటే ఈ సినిమా ఆద్యంతం నవ్విస్తూ, భయపెట్టేలా కనిపిస్తోంది.
నటీనటులు : వెన్నెల కిషోర్, నందితా శ్వేత, షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, రఘుబాబు తదితరులు
సాంకేతిక సిబ్బంది
బ్యానర్: మార్క్‌సెట్ నెట్‌వర్క్
ప్రొడ్యూసర్: డా.అబినికా ఇనాబతుని
డైరెక్టర్: శంకర్ మార్తాండ్
సినిమాటోగ్రాఫర్: ఐ ఆండ్రూ
మ్యూజిక్ డైరెక్టర్: అనూప్ రూబెన్స్
ఆర్ట్ డైరెక్టర్: సుప్రియ
ఎడిటర్: ఎం.ఆర్.వర్మ
కొరియోగ్రాఫర్: బాబా భాస్కర్
విజువల్ ఎఫెక్ట్స్: విక్టర్, కళ్యాణ్, విజయ్
PRO: SR ప్రమోషన్స్ (సాయి సతీష్)