‘తండేల్’ నుంచి అదిరిపోయే ఫోటోని సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన నాగ చైతన్య

0
69

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘తండేల్’. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో అత్యంత భారీ బడ్జెట్‌తో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా హీరో నాగ చైతన్య సినిమాలోని ఒక ఫోటోని ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలో నాగ చైతన్య పల్లెటూరి గెటప్‌లో కనిపిస్తున్నారు. చొక్కా , నల్ల ప్యాంటు ధరించి, మెడలో రెడ్ టవల్ తో మ్యాసీ హెయిర్, గుబురు గడ్డం, చేతిలో తాడుతో పడవలో నిలబడి, ఆకట్టుకునే చిరునవ్వుతో మెరుస్తూ కనిపించారు నాగచైతన్య. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా ట్రెండ్ అవుతోంది.

తండేల్ లో మత్స్యకారుడి పాత్ర కోసం నాగచైతన్య ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకొని కంప్లీట్ గా మేకోవర్ అయ్యారు. తన యాసపై ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ సినిమాలో శ్రీకాకుళం స్లాంగ్‌లో డైలాగులు చెప్పనున్నారు నాగచైతన్య.

ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, షామ్‌దత్ డీవోపీగా పని చేస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్.

తారాగణం: నాగ చైతన్య, సాయి పల్లవి

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: చందూ మొండేటి
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాత: బన్నీ వాసు
బ్యానర్: గీతా ఆర్ట్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డీవోపీ: షామ్‌దత్
ఆర్ట్: శ్రీనాగేంద్ర తంగాల
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here