అకుంఠిత దీక్షతో రాష్ట్రంలోనే BiPC 3వ ర్యాంకు సాధించిన చిదిరేమటం సాయి కార్తీక్

0
148

చిదిరేమటం సాయి కార్తీక్ రాష్ట్రంలోనే BiPC 3వ ర్యాంకు సాధించి తన అకుంఠిత దీక్ష ప్రదర్శించారు. ఎంతో కష్టతరమైన మెడిసిన్ విద్యలో ఇంతటి గొప్ప విజయాన్ని సాధించడం ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు ఆనందాన్ని కలుగచేస్తుంది….

అయితే ఎవరు ఈ సాయి కార్తీక్? సాయి కార్తీక్ ఇంతటి విజయం సాధించడం వెనుక ఉన్నది ఎవరు? అని వివరాలలోకి వెళ్ళగా తెలిసినది ఏంటి అంటే, నమస్తే తెలంగాణ దినపత్రిక సీనియర్ ఫోటోగ్రాఫర్ ప్రవీణ్ గారి అబ్బాయి అని తెలిసింది. తన తండ్రి మీడియా రంగంలో చురుకుగా ఉండే విషయం అందరికీ తెలిసిందే. అదే చురుకుతనం తన కుమారుడికి రావడం విశేషం. తండ్రి వలె కొడుకు అన్నట్లు తన ఆప్టిట్యూడ్ స్కిల్స్ ఇంకా సైన్స్ లో చాల ఆక్టివ్ గా ఉంటూ ఇంతకీ విజయాన్ని సాయి కార్తీక్ సాధించాడు.

3వ ర్యాంకు సాధించడం వెనుక సాయి కార్తీక్ నిరంతర శ్రమ, సహజమైన తెలివితేటలు, మొక్కవోని ఆత్మవిశ్వాసం కనిపిస్తాయి. ప్రతి రోజూ ఒకే దృష్టి తో చదువే పరమావధిగా క్రమబద్ధమైన దినచర్య, క్రమశిక్షణతో నే ఇలాంటి అపూర్వ విజయాలు సాధ్యపడతాయి. ఇంతటి విజయాన్ని సాధించిన సాయి కార్తీక్, తనకి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి, ఆ దిశగా స్ఫూర్తి నీ నింపిన తండ్రి ప్రవీణ్ అభినందనీయులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here