‘ఆర్ఎక్స్ 100’ చిత్ర దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మంగళవారం’. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి థియేటర్లలో అన్ని వర్గాల ప్రేక్షకుల తో పాటు విమర్శకుల ప్రశంసలూ అందాయి. ఈ చిత్రం ఇటీవల డిస్ని హాట్ స్టార్ లో విడుదలవ్వగా దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన లభించింది.
మంచి కథని ఆదరించే మన ప్రేక్షకులకి సినిమాల పై ఉండే మక్కువ తెలిసిందేగా. అదే రుజువు చేస్తూ తాజాగా ‘మంగళవారం’ టీవీ ప్రీమియర్ కి 8.3 టి.ఆర్.పి వచ్చింది. పెద్ద హీరోల చిత్రాలకి మాత్రమే వచ్చే రేటింగులకి ధీటుగా ‘మంగళవారం’ కథ ప్రేక్షకులకి ఎంతగా చేరిందో తెలుస్తుంది.
ఇప్పటికే విడుదలయిన మూడు మాధ్యమాల్లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడంతో దర్శకుడు అజయ్ భూపతి, నిర్మాతలు స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం సంతోషం వ్యక్తం చేసారు.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మించారు.
నటీనటులు:
పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమీర్, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, లక్ష్మణ్ తదితరులు.
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : అజయ్ భూపతి
సినిమాటోగ్రఫీ : దాశరథి శివేంద్ర
మ్యూజిక్ : ‘కాంతార’ ఫేమ్ బి. అజనీష్ లోక్‌నాథ్
ఎడిటర్ : మాధవ్ కుమార్ గుళ్ళపల్లి
నిర్మాతలు : స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం
మాటలు : తాజుద్దీన్ సయ్యద్, రాఘవ్
ఆర్ట్ డైరెక్టర్ : మోహన్ తాళ్లూరి
ప్రొడక్షన్ డిజైనర్ : రఘు కులకర్ణి
ఫైట్ మాస్టర్స్ : రియల్ సతీష్, పృథ్వీ
సౌండ్ డిజైనర్ & ఆడియోగ్రఫీ : ‘నేషనల్ అవార్డ్ విన్నర్’ రాజా కృష్ణన్
కొరియోగ్రఫీ : భాను
కాస్ట్యూమ్ డిజైనర్ : ముదాసర్ మొహ్మద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయికుమార్ యాదవిల్లి
పీఆర్వో : పులగం చిన్నారాయణ
డిజిటల్ మార్కెటింగ్ : టాక్ స్కూప్