ఈ రోజు (ఫిబ్రవరి 22) మా గురువు “కోడి రామకృష్ణ” గారి వర్ధంతి – దేవీ ప్రసాద్

0
47

 

ఆయన 50 సినిమాలకు దర్శకత్వం వహించటం పూర్తిచేసిన సందర్భంలో అందరూ అభినందిస్తుంటే… దీనికే మనం సంబరపడిపోతే ఎట్లా.. మనం 100 సినిమాలు పూర్తిచేయాలయ్యా అని ఆయన అన్నప్పుడు, అక్కడేవున్న ఓ ప్రముఖ వ్యక్తి పక్కకొచ్చి ఈయనకు మరీ అత్యాశ అని వ్యంగ్యంగా నవ్వుకున్నప్పుడు నేనక్కడే వున్నాను. అన్నట్లే ఆయన శతాధికచిత్రాలను పూర్తిచేసి పరుగుపెడుతున్నప్పుడూ ఆ నవ్వుకున్నవాళ్ళను చూస్తూనే వున్నాను.

సంకల్పబలానికి కసి,కృషి తోడైతే దాని పేరు “కోడిరామకృష్ణ”.

నా జీవితానికి సంబంధించినంతవరకూ “పని”లో ఆయనను మించి నేను ప్రేరణను పొందిన మరో వ్యక్తిని నేను ఇంకా కలవలేదు.

కావాలని పోవాలనుకోరెవ్వరూ….
ఉండాలనుకున్నా ఎప్పటికీ ఉండిపోరెవ్వరూ….
పోయినా ఉన్నట్టే ఉండిపోతారు కొందరు….
అలా ఉండిపోయిన గురువుగారికి నా నివాళులు.

(నా నీటిరంగుల్లో గురువుగారు)

________ దేవీ ప్రసాద్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here