సినీ సామాజికవేత్త విజయ్ వర్మ పాకలపాటి కి విశ్వగురు సేవా పురస్కారం

0
301

 

పురస్కారాన్ని అందించిన హైకోర్టు జడ్జి వేణుగోపాల్

సినీ నిర్మాత గా దర్శకుని గా మరియు వివిధ సామాజిక కార్యక్రమాలతో రాష్ట్ర దేశ స్థాయిలో ఎన్నో ప్రశంసలు పొందిన వీస్ విజయ్ వర్మ పాకలపాటి కి మరో అత్యున్నత పురస్కారం లభించింది. ప్రతిష్టాత్మక విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ గ్రామ స్థాయినుండి ఉభయ తెలుగు రాష్ట్రాలలో తనవంతు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న విజయ్ వర్మ పాకలపాటి ని విశ్వగురు సేవా పురస్కారంతో సత్కరించింది.హైకోర్టు జడ్జి వేణుగోపాల్ గారు ఈ పురస్కారాన్ని అందించి విజయ్ వర్మ ను అభినందించారు .సంస్థ వ్యవస్థాపకులు సత్యవోలు రాంబాబు గారు, రిటైర్డ్ ఐ ఏ ఎస్ లక్ష్మికాంత్ లు విజయ్ వర్మ అందిస్తున్న తనవంతు సేవలు ఎందరికో ఆదర్శమని కొనియాడారు. అవార్డు గ్రహీత విజయ్ వర్మ పాకలపాటి మాట్లాడుతూ :- సినీ నటులు బ్రహ్మానందం , సినీ నటులు ఆదిత్య ఓం , నారీసేన వ్యవస్థాపకురాలు లతా బోట్ల , రోటరీ సంస్థ, షిర్డీ సాయి సంస్థాన్ యూ ఎస్ ఏ, రోటేరియన్ సురేన్ వంటి ఎందరో ప్రముఖుల సహకారంతోనే కొన్ని కార్యక్రమాలు చెయ్యగలిగానని , భవిష్యత్ లో దేశ అంతర్జాతీయ సేవా సంస్థల సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని సేవలు అందించనున్నట్లు తెలిపారు.
.తన సేవలను గుర్తించి విశిష్ట పురస్కారాన్ని అందించిన సంస్థ వ్యవస్థాపకులు రాంబాబు గారికి అవార్డు గ్రహీత సినీ సామాజిక వేత్త వీస్ విజయ్ వర్మ పాకలపాటి కృతఙ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here