‘తండేల్’ షూటింగ్ లో జాయిన్ అయిన సాయి పల్లవి – స్నీక్ పీక్ విడుదల

0
169

యువ సామ్రాట్ నాగ చైతన్య, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ చందూ మొండేటి, ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ క్రేజీ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ ‘తండేల్’ ఇటివలే సెట్స్ పైకి వెళ్ళింది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఉడిపిలో ప్రారంభమైంది. షూటింగ్ ఇప్పుడు గోకర్ణకు షిఫ్ట్ అయ్యింది. ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న సాయి పల్లవి టీంలో జాయిన్ అయ్యింది.

ఈ చిత్రంలో రాజు అనే జాలరి పాత్రలో నాగ చైతన్య నటిస్తుండగా, అతని మనసుని గెలుచుకున్న అమ్మాయిగా సాయి పల్లవి కనిపిస్తోంది. ఇందులో అద్భుతమైన మ్యాజికల్ లవ్ స్టోరీని చూడబోతున్నాం. ‘తండేల్’ వరల్డ్ నుండి హీరోయిన్ స్నీక్ పీక్ విడుదల చేశారు. ఈ ఇమేజ్ లో సాయి పల్లవి బీచ్‌లో నిలబడి సూర్యోదయాన్ని ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తోంది. అందమైన పల్లెటూరి అమ్మాయిగా ఆకట్టుకుంది సాయిపల్లవి.

యదార్థ సంఘటనల కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. షూట్ ప్రారంభించే ముందు టీమ్ ఇంటెన్స్ ప్రీ-ప్రొడక్షన్ వర్క్ చేసింది. నాగ చైతన్య తన పాత్ర కోసం కంప్లీట్ మేక్ఓవర్ అయ్యారు.

అత్యున్నత సాంకేతిక నిపుణులను ఈ చిత్రానికి పని చేస్తున్నారు. కథలో సంగీతానికి మంచి స్కోప్ ఉన్నందున, జాతీయ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన సౌండ్‌ట్రాక్‌లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ప్రేమకథను అందంగా తీర్చిదిద్దుతున్నారు. విజువల్ వండర్ ని అందించడానికి షామ్‌దత్ కెమెరామ్యాన్ గా పని చేస్తున్నారు. ఆర్ట్ విభాగాన్ని శ్రీనాగేంద్ర తంగాల పర్యవేక్షిస్తున్నారు.

తారాగణం: నాగ చైతన్య, సాయి పల్లవి

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: చందూ మొండేటి
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాత: బన్నీ వాసు
బ్యానర్: గీతా ఆర్ట్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డీవోపీ: షామ్‌దత్
ఆర్ట్: శ్రీనాగేంద్ర తంగాల
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here