కింగ్ నాగార్జున అక్కినేని, ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వంలో చేస్తున్న ‘నా సామి రంగ’ సినిమాని పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నారు. దర్శకుడిగా విజయ్ బిన్నికి ఇది తొలి చిత్రం. ఆశికా రంగనాథ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆమె పాత్రను వరలక్ష్మిగా తాజాగా పరిచయం చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు విడుదల చేసిన గ్లింప్స్ లో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ కట్టిపడేసింది.
ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుంది త్వరలో విడుదల కానుంది. లిరికల్ వీడియోను లాంచ్ చేయడానికి ముందు పాట ప్రోమోను విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. రైతు గెటప్‌లో నాగార్జున చాలా ఎలిగెంట్ గా కనిపించారు. వ్యవసాయ భూమిలో ట్రాక్టర్ పై కాలు వేసి బీడీ కాలుస్తూ మాస్ వైబ్ తో ఆకట్టుకున్నారు నాగార్జున.
గ్లింప్స్ లో అద్భుతమైన బీజీఎంతో మంత్రముగ్ధులను చేసిన ఎంఎం కీరవాణి ఈ చిత్రంకు అద్భుతమైన సౌండ్‌ట్రాక్‌లను అందించారు. ఆల్బమ్‌లోని అన్ని పాటలకు చంద్రబోస్ లిరిక్స్ రాశారు.
#NaaSaamiRanga audio on the renowned @JungleeMusicSTH ❤🔥
Oscar Winners @mmkeeravaani musical 🎼 and @boselyricist ✍️lyrics
First single #YettukelliPovalanipisthunde coming soon🎵
Get ready for a musical treat like never before! 🔥🎧 #NagarjunaKeeravaaniMagic… pic.twitter.com/HapKwztBA0
— BA Raju's Team (@baraju_SuperHit) December 6, 2023
మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి మ్యాసివ్ బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి.
బ్లాక్ బస్టర్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు.
‘నా సామి రంగ’ 2024 సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా విడుదల కానుంది.
తారాగణం: కింగ్ నాగార్జున అక్కినేని, ఆషికా రంగనాథ్, కరుణ కుమార్
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: విజయ్ బిన్ని
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
సంగీతం: ఎంఎం కీరవాణి
సమర్పణ: పవన్ కుమార్
కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ
సాహిత్యం: చంద్రబోస్
పీఆర్వో: వంశీ-శేఖర్



