ఈ పండక్కి ‘హనుమాన్’ తో థియేటర్లో పండగ చేసుకుందాం. హను-మాన్ ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ అసలు సిసలైన సంక్రాంతి సినిమా: ఆవకాయ ఆంజనేయ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో తేజ సజ్జ & డైరెక్టర్ ప్రశాంత్ వర్మ
దర్శకుడు ప్రశాంత్ వర్మ, హను-మాన్ టీం తేజ సజ్జ లీడ్ రోల్ నటించిన ఒరిజినల్ సూపర్ హీరో చిత్రం ‘హను-మాన్’ రెండవ పాట సూపర్ హీరో హనుమాన్‌ని లాంచ్ చేసి ప్రమోషన్స్ లో దూకుడు పెంచారు. బాలల దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ పాట చిన్నారులతో పాటు పెద్దలను కూడా ఆకట్టుకుంది. ఈ రోజు, హనుమాన్ టీమ్ చిత్రంలోని మూడవ సింగిల్ ఆవకాయ ఆంజనేయ సాంగ్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు.
మాసీ బీట్ లతో కూడిన ఈ గ్రూవీ ఫోక్ సాంగ్ అనుదీప్ దేవ్ అద్భుతంగా స్వరపరిచారు. అమృత అయ్యర్ తో పాటు వయసుమళ్ళిన మరో మహిళ ఆవకాయ ఊరగాయను సిద్ధం చేస్తున్న సన్నివేశంతో పాట ప్రారంభమవుతుంది. కొంతమంది ముసుగులు ధరించిన వ్యక్తులు ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు వారిని రక్షించడానికి ఆంజనేయ స్వామి వంటి హనుమంతుడు వస్తాడు. ఆవకాయను తయారుచేసే సంప్రదాయం, యాక్షన్ ఎపిసోడ్ అద్భుతంగా బ్లెండ్ అవుతూ విజిల్స్ వేయాలనిపించేలా ఆకట్టుకున్నాయి.
సింహాచలం మన్నెల అందించిన సాహిత్యం మెమరబుల్ గా వుంది. సాహితీ పాటని అద్భుతంగా ఆలపించారు. వాయిస్ చాలా లైవ్లీగా వుంది. తేజ సజ్జ ఈ పాటలో పవర్-ప్యాక్డ్ అవతార్‌లో కనిపించారు. యాక్షన్ బ్లాక్‌లు కూడా పర్ఫెక్ట్‌గా డిజైన్ చేశారు.
హనుమాన్ చాలీసా భక్తి గీతం అయితే, సూపర్ హీరో హనుమాన్ హిలేరియస్ సాంగ్. మూడవ సింగిల్ ఆవకాయ ఆంజనేయ ఫోక్ నెంబర్. ఈ ఆల్బమ్‌లో విభిన్న జానర్ ల పాటలు ఉన్నాయి . ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటలు ఒకదానికొకటి భిన్నంగా ఆకట్టుకున్నాయి.
Amma, Avakaya, and Anjaneya are an emotion 🥭🐒
Enjoy the making of Avakaya & the bashing of #HANUMAN in the 3rd lyrical #AvakayaAnjaneya 🎶
🥁 @anudeepdev
🎤 #SahithiGalidevara
✍️ #SimhachalamMannelaA @PrasanthVarma Film
🌟ing @tejasajja123In WW… pic.twitter.com/uyVz9N8Qqi
— BA Raju's Team (@baraju_SuperHit) November 28, 2023
హీరో తేజా సజ్జ మాట్లాడుతూ.. మనకి ఆపద వస్తే ఆంజనేయ స్వామి, ఆకలేస్తే ఆవకాయ..ఇది మన కల్చర్ లో బలంగా మనందరిలో పాతుకుపోయి వుంది. ఇదొక ఎమోషన్. అలాంటి కల్చర్ ని కమర్షియల్ వే లో చాలా గొప్పగా చూపించడానికి ప్రశాంత్ గారు ప్రయత్నించారు. దీనికి గ్రేట్ ట్యూన్ ఇచ్చిన అనుదీప్ గారికి, మంచి లిరిక్స్ ఇచ్చిన సింహా గారికి, అద్భుతంగా పాడిన సాహితి గారికి, హిందీలో పాడిన సునీధి చౌహాన్ గారికి మలయాళంలో పాడిన సితార గారికి థాంక్స్. అద్భుతమైన ఆలోచనని అంతే అద్భుతంగా విజువలైజ్ చేసిన ప్రశాంత్ గారికి థాంక్స్. ఈ సంక్రాంతికి హనుమాన్ థియేటర్స్ లోకి రాబోతుంది. అందరూ థియేటర్ కి వచ్చి చూడండి. ఈ పండక్కి హనుమాన్ తో థియేటర్లో పండగ చేసుకుందాం’’ అన్నారు
దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. ఆవకాయ ఆంజనేయ పాట చాలా ప్రత్యేకం. ఈ పాటతోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలుపెట్టాం. టీజర్ తో సినిమాకి చాలా మంచి హైప్ వచ్చింది. జనాల్ని చాలా ఆకట్టుకుంది. సినిమాపై చాలా అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా ఎలా ఉండబోతుంది ? ఏ జానర్ లలో వుంటుంది ? పూర్తిగా మైథాలజికల్ ఉంటుందా ? సినిమాల హనుమంతుడు ఉంటారా లేదా? ఇలా చాలా ఆసక్తిరమైన ప్రశ్నలు వున్నాయి. అయితే తర్వాత విడుదల చేస్తున్న ఒకొక్క ప్రమోషనల్ మెరటిరియల్ తో సినిమాలో ఏముంటుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మొదటి పాట హనుమాన్ చాలీసా.. సినిమాలో చాలా ముఖ్యమైన భక్తి గీతం. తర్వాత విడుదల చేసిన సూపర్ హీరో పాటతో ఈ సినిమా చూసి చిన్నపిల్లలు ఎంత వినోదాన్ని పొందవచ్చో అర్ధమైవుంటుంది. ఇప్పుడు ఆవకాయ ఆంజనేయ ద్వారా సినిమాలో ఎంత మాస్, యాక్షన్, ఫన్ ఉండబోతుందో అర్ధం చేసుకోవచ్చు. ఇది అసలు సిసలైన సంక్రాంతి సినిమా. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ చూడదగ్గ సినిమా. సినిమాలో ఒక్క ధూమపానం, మద్యపానంకు సంబధించిన ఒక్క షాట్ కూడా వుండదు. టోటల్ క్లీన్ ఫిల్మ్ ఇది. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ అంతా కలసి చూడదగ్గ సినిమా. కథ చాలా ఆసక్తికరంగా వుంటుంది. చాలా ఎంటర్ టైనింగ్ గా చెప్పాం. ఇప్పటివరకూ నేను చేసిన చిత్రాలలో హనుమాన్ మోస్ట్ ఎంటర్ టైనింగ్ మూవీ. ఆవకాయ ఆంజనేయ పాటని అనుదీప్ అద్భతంగా కంపోజ్ చేశారు. తేజ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. చాలా కష్టపడ్డాడు. ఇందులో ప్రతి పాట కథని ముందుకు తీసుకెళుతుంది. ఈ పాటలో మంచి ట్విస్ట్ వుంది. శివేంద్ర గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. నాగేంద్ర గారు బ్రిలియంట్ సెట్ వర్క్ చేశారు. సాయి బ్రిలియంట్ గా ఎడిట్ చేశారు. సింహా గారు మంచి లిరిక్స్ ఇచ్చారు. సాహితి అద్భుతంగా పాడారు. ఈ పాట తెలుగు తమిళ్ కన్నడ లో సాహితి పాడారు. హిందీలో సునిదీ చౌహాన్ పాడారు. మలయాళంలో సితార పాడారు. ప్రతి భాషకు చాలా కేర్ తీసుకుంటున్నాం. వేరే భాషలో చూసినప్పుడు డబ్బింగ్ సినిమాలా అనిపించకుండా ఒరిజినల్ ఫీలింగ్ నే కలిగిస్తుంది. నిర్మాత నిరంజన్ గారు ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని చాలా గ్రాండ్ గా నిర్మించారు. ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు’’ తెలిపారు.
సంగీత దర్శకుడు అనుదీప్ మాట్లాడుతూ.. నన్ను బలంగా నమ్మి ఇంత పెద్ద భాద్యత ఇచ్చిన ప్రశాంత్ గారికి ధన్యవాదాలు. ఎక్కడారాజీపడకుండా ప్రతిది సమకూర్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు. ప్రశాంత్ చెప్పిన సిట్య్చువేషన్ చాలా అద్భుతంగా అనిపించింది. పాట చేస్తున్నపుడు ఆయన చాలా హెల్ప్ చేశారు. నా మ్యూజిక్ టీం అందరికీ ధన్యవాదాలు’ తెలిపారు. ఈ వేడుకలో గెటప్ శ్రీను, శివేంద్ర, సింగర్ సాహితి, లిరిక్ రైటర్ సింహాచలం మిగతా చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ మాగ్నమ్ ఓపస్‌కి సినిమాటోగ్రఫీ శివేంద్ర. ప్రొడక్షన్ డిజైనర్ శ్రీనాగేంద్ర తంగాల.
వినయ్ రాయ్ విలన్‌గా కనిపించనుండగా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మొదటి సినిమా హను-మాన్. హను-మాన్ “అంజనాద్రి” ఊహాత్మక ప్రదేశంలో సెటప్ చేయబడింది. సినిమా కాన్సెప్ట్ యూనివర్సల్‌గా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా మంచి విజయం సాధించే అవకాశం ఉంది.
హనుమాన్ జనవరి 12, 2024న తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్ విడుదల కానుంది.
తారాగణం: తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
నిర్మాత: కె నిరంజన్ రెడ్డి
బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్
సమర్పణ: శ్రీమతి చైతన్య
స్క్రీన్‌ప్లే: స్క్రిప్ట్స్‌విల్లే
డీవోపీ: దాశరధి శివేంద్ర
సంగీత దర్శకులు: గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్
ఎడిటర్: సాయిబాబు తలారి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అస్రిన్ రెడ్డి
లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి
అసోసియేట్ ప్రొడ్యూసర్: కుశాల్ రెడ్డి, పుష్పక్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల
పీఆర్వో: వంశీ-శేఖర్
కాస్ట్యూమ్ డిజైనర్: లంకా సంతోషి