విష్ణు మంచు బర్త్ డే సందర్భంగా నవంబర్ 23న ‘కన్నప్ప’ క్రేజీ అప్డేట్

0
26

 

డైనమిక్ స్టార్ విష్ణు మంచు ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప గురించి జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ కన్నప్ప సినిమా రోజురోజుకూ తన స్థాయిని పెంచుకుంటూపోతోంది. ప్రతీ ఇండస్ట్రీలోని ఓ స్టార్ ఈ కన్నప్పలో పాలు పంచుకుంటున్నారు. ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ ఇలా అందరూ కన్నప్పలో నటిస్తున్నారు.

మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్, తమిళ్ నుంచి విలక్షణ నటుడు శరత్ కుమార్ వంటి వారంతా కన్నప్పలో ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. డార్లింగ్, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ రాకతో కన్నప్ప మీద అందరి దృష్టి పడింది. ఈ చిత్రంలో మోహన్ బాబు సైతం ఓ కీ రోల్‌ను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో టైటిల్ రోల్‌లో విష్ణు మంచు కనిపించబోతున్నారు. ప్రస్తుతం చిత్రయూనిట్ న్యూజిలాండ్ లో షూటింగ్ చేస్తోంది. దాదాపు 80 శాతం షూటింగ్ అంతా కూడా న్యూజిలాండ్‌లోనే జరగనుంది. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీక్వెన్స్, న్యూజిలాండ్ ప్రకృతి అందాలు కన్నప్ప సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవబోతున్నాయి.

విష్ణు మంచు బర్త్ డే (నవంబర్ 23) సందర్భంగా కన్నప్ప నుంచి క్రేజీ అప్డేట్ రాబోతోంది. ఈ మేరకు విష్ణు మంచు అధికారికంగా ప్రకటించారు. భారతీయ కాలమాన ప్రకారం ఉదయం 2.45 గం.లకు, న్యూజిలాండ్‌లో 10.15గం.లకు అప్డేట్ రాబోతున్నట్టుగా ట్వీట్ వేశారు. ఇక ఈ అప్డేట్ తరువాత సినిమా మీద మరింతగా అంచనాలు పెరిగేట్టున్నాయి.

శివ భక్తుడైన కన్నప్ప జీవిత చరిత్ర చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. అతని భక్తిని, ఆయన భక్తికి ఉన్న శక్తిని ఇప్పటికీ అందరూ తలుచుకుంటారు. శ్రీకాళహస్తిలోని గుడిలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. మహాభారతం సీరియల్ తీసిన ముకేష్ కుమార్ సింగ్ ఈ కన్నప్ప చిత్రాన్ని విజువల్ వండర్‌గా రూపొందిస్తున్నారు. ఇదొక మైలురాయిగా నిలిచేట్టు రూపొందిస్తున్నారు. ఈ మూవీలోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, కథను చెప్పే విధానం, మేకింగ్ తీరు ఇలా అన్నీ కూడా ఇండియన్ సినిమా హిస్టరీలో నిలిచిపోనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here