శ్రీ చంద్రమోహన్ మృతి పట్ల తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రగాఢ సంతాపం

0
229

9/TFCC/2023-25 Dt. 11/11/2023

ప్రచురణార్ధం

ప్రముఖ చలన చిత్ర నటుడు శ్రీ చంద్రమోహన్ ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

శ్రీ చంద్రమోహన్ పమిడి ముక్కల గ్రామం, కృష్ణ జిల్లాలో 1942, మే 23 న జన్మించారు. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్. సినిమాలలో నటించాలనే ఉత్సాహంతో మద్రాస్ చేరి హీరోగా “రంగుల రాట్నం” సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసారు. కథానాయకుడిగా 175 చిత్రాలు, మొత్తం 932 సినిమాలలో నటించారు. సహానాయకుడిగా, కథానాయకుడిగా, హాస్యనాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. 1966, 1987, 2005 సంవత్సరాలలో నంది పురస్కారం పొందారు.

శ్రీ చంద్రమోహన్ మృతి పట్ల తెలుగు చలన చిత్ర పరిశ్రమ తమ సంతాపాన్ని తెలియచేస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియచేయడమైనది.

(వి. వెంకటరమణా రెడ్డి) (దిల్ రాజు) (కె . ఎల్ .దామోదర్ ప్రసాద్)
ప్రెసిడెంట్ గౌరవ కార్యదర్శి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here