రూల్స్ రంజన్’పై ప్రేమను కురిపించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు: దర్శకుడు రత్నం కృష్ణ

0
196

ప్రేమ మరియు కృతజ్ఞతతో…

 

‘రూల్స్ రంజన్’పై ప్రేమను కురిపించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు: దర్శకుడు రత్నం కృష్ణ

 

రూల్స్ రంజన్ నాకు ఎప్పటికీ ప్రత్యేకమైన సినిమా. ఇది నా శ్రమతో కూడిన ప్రేమ, పూర్తి వినోదాత్మకంగా రూపొందించి మీ అందరి ముఖాల్లో చిరునవ్వులు నింపడానికి చేసిన ప్రయత్నం. ఇది విడుదలైనప్పటి నుండి ప్రేమతో ముంచెత్తినందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్, సోషల్ మీడియా పోస్ట్‌లతో నా హృదయం నిండిపోయింది. బిగ్ స్క్రీన్‌పై మీరు నిజంగా ఆస్వాదించే సినిమాలను రూపొందించాలనే ప్రేరణను నాలో పెంచింది.

 

సినిమా ప్రమోషన్స్ నుండి విడుదలయ్యే వరకు ఎంతో ఉత్సాహంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లిన మీడియాకు కృతజ్ఞతలు. నా నటీనటులు కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి మరియు వివిధ పరిశ్రమలకు చెందిన ఇతర ప్రతిభావంతులైన కళాకారులు, నా సాంకేతిక నిపుణులు – సినిమాటోగ్రాఫర్ ఎంఎస్ దులీప్ కుమార్, స్వరకర్త అమ్రిష్ మరియు ముఖ్యంగా నా నిర్మాతలు దివ్యాంగ్ లావానియా, మురళీ కృష్ణ వేమూరి, రింకు కుక్రెజ, నా అసిస్టెంట్లు ఇలా మొత్తం టీం లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు.

 

భవిష్యత్తులో కొత్త, పెద్ద, గొప్ప కథలతో మిమ్మల్ని మరింత అలరిస్తానని ఆశిస్తున్నాను.

 

– దర్శకుడు రత్నం కృష్ణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here