రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న హై యాక్షన్ డ్రామా ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ దీపావళికి రిలీజ్ కాబోతుంది. వెర్సటైల్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో స్టోన్ బెంచ్ ఫిలింస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని కార్తీకేయన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని మేకర్స్ తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. మంగళవారం ఈ చిత్రం నుంచి ‘కోరమీసం’ అనే పాటను హైద్రాబాద్‌లో రిలీజ్ చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో..
నిర్మాత కార్తికేయన్ మాట్లాడుతూ.. ‘జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమాను నిర్మించడం నాకు సంతోషంగా ఉంది. ఇది చాలా మంచి సినిమా. వంద కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తీసుకొస్తున్నాం. ఈ సినిమా ఒక పండుగలా ఉంటుంది. అందుకే దీపావళికి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాం. మా సినిమాను అందరూ చూసి ఆశీర్వదించండి’ అని అన్నారు.
దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ.. ‘తమిళంలో పిజ్జా రిలీజ్ అయిన వారానికి తెలుగులో వచ్చింది. ఇక్కడ కూడా ఆ మూవీని బాగా ఆదరించారు. నా మీద ప్రేమను కురిపించారు. ఆ తరువాత ప్రతీ సినిమాను ఆదరిస్తూ వచ్చారు. నా గత చిత్రాల మాదిరిగానే ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ను ఆధరిస్తారని ఆశిస్తున్నాను. నా కంటే ఎక్కువగా నా సినిమా మాట్లాడాలి. జిగర్ తండలో చూసిన దానికంటే డబుల్ ఎక్స్ రేంజ్‌లో సినిమా ఉంటుంది. అందుకే టైటిల్ అలా పెట్టాను. ఇది సీక్వెల్ అని చెప్పలేం. ఫస్ట్ పార్ట్‌లో సేతు పాత్ర (బాబీ సింహా కారెక్టర్)ను లారెన్స్ సర్ చేయాల్సింది. కానీ అప్పుడు కుదర్లేదు. ఈ సినిమా కోసం మళ్లీ లారెన్స్ సర్‌ను అడిగాను. ఈ సినిమాలో లారెన్స్ సర్ గ్యాంగ్ స్టర్‌లా.. ఎస్ జే సూర్య సర్ ఫిల్మ్ మేకర్‌లా కనిపిస్తారు. వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయ’ని అన్నారు.
ఎస్ జే సూర్య మాట్లాడుతూ.. ‘జిగర్ తండ డబుల్ ఎక్స్ నాకు ఎంతో స్పెషల్. మొదటి పార్ట్ ఫుల్ సక్సెస్ అయింది. కార్తీక్ సుబ్బరాజ్ అంటే ఏంటో ఆ సినిమా నిరూపించింది. ఇప్పుడు లారెన్స్ చేస్తుండటంతో అది తమిళ, తెలుగు, హిందీ సినిమాగా మారింది. గ్యాంగ్ స్టర్‌కి ఫిల్మ్ మేకర్ మధ్య జిగర్ తండ జరిగింది. అదే కాన్సెప్ట్‌తో ఇంకాస్త ముందుకు వెళ్లి ఈ కథను రాసుకున్నారు. 70వ దశకాన్ని బ్యాక్ డ్రాప్‌గా తీసుకున్నారు. మణిరత్నం సినిమాలా కార్తీక్ సుబ్బరాజ్ తీసే ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకంటాయి. అవార్డులను కూడా తెచ్చిపెడతాయి. నటీనటుల నుంచి పర్ఫామెన్స్ తీసుకోవడంలో కార్తీక్ సుబ్బరాజ్‌ది ప్రత్యేక శైలి. మనమే నటించామా? అని ఆశ్చర్యపోయేలా నటనను రాబట్టుకుంటారు. కెమెరామెన్ తిరు అద్భుతంగా చూపించాడు. ఈ టీజర్‌ను మా కోసం మహేష్ బాబు గారు రిలీజ్ చేశారు. ఆయనకు ప్రత్యేకంగా థాంక్స్. మార్క్ ఆంటోని తమిళ్‌లో పెద్ద హిట్ అయింది. ఇక్కడ మామూలుగా హిట్ అయింది. మా జిగర్ తండ డబుల్ ఎక్స్ తమిళ్‌లో ఎంత పెద్ద హిట్ అవుతుందో.. ఇక్కడ కూడా అంతే పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
రాఘవ లారెన్స్ మాట్లాడుతూ.. ‘నేను సినిమా గురించి ఎక్కువగా మాట్లాడను. సినిమాను చూసి ఆడియెన్స్ మాట్లాడతారు. మొదటి పార్ట్ నేను చేయాల్సింది. కానీ కుదర్లేదు. ఆ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్‌కు జాతీయ అవార్డు వచ్చింది. ఇప్పటికీ ఆ సినిమా టీవీలో వస్తే నేను చూడను. ఈ మూవీ కథను చెప్పిన వెంటనే ఓకే చెప్పాను. నిర్మాత వంద కోట్లు పెట్టారు. ఇది దర్శకుడి సినిమా. అన్ని పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుంది. కంటెంట్ ఉంటే ఇప్పుడు సినిమా అద్భుతంగా ఆడేస్తోంది. సెట్‌కు వెళ్లే ముందు ఎన్నో అనుకుని వెళ్తాం.కానీ కార్తీక్ సుబ్బరాజు వర్షన్ వేరేలా ఉంటుంది. ఆయన చెప్పినట్టే చేయాల్సి ఉంటుంది. ప్రతీ విషయంలో ఆయన ఎంతో స్ట్రిక్ట్‌గా ఉంటారు. టార్చర్ పెట్టినట్టుగా అనిపిస్తుంది. తమిళ్, తెలుగు , హిందీ సినిమా తీస్తాడని అనుకుంటే.. ఇంగ్లీష్ సినిమా తీసినట్టుగా అనిపిస్తుంది. మిగతా సినిమాల్లో అయితే మేకప్‌లు వేసేవారు. కానీ ఈ చిత్రానికి మేకప్ వాడలేదు. మేకప్ లేకుండా ఎలా కనిపిస్తానా? వద్దని అన్నాను. కానీ స్క్రీన్ మీద చూసుకున్నాక నా మీద నమ్మకం ఏర్పడింది. మా అమ్మ ఇచ్చిన కలర్‌తోనే ఇకపై కనిపించాలనేంత నమ్మకం వచ్చింది. నాకు యాక్టింగ్‌లో ఎస్ జే సూర్య గారు టిప్స్ ఇవ్వలేదు. అందుకే నేను కూడా డ్యాన్స్ మూమెంట్స్ అప్పుడు ఆయనకు టిప్స్ ఇవ్వలేదు. ఈ సినిమా కోసం ఓ ఊర్లో రోడ్డు, బ్రిడ్జ్ నిర్మించారు మా నిర్మాత. ఆయన మంచి మనసు కోసమైనా ఈ చిత్రం బాగా ఆడాలి. ఈ సినిమాను అందరూ థియేటర్లో చూడండి’ అని అన్నారు.
https://x.com/baraju_superhit/status/1711713910032888112?s=46