శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్, శ్రీ లక్ష్మి మూవీస్ #SKxARM దర్శకుడి పుట్టినరోజున అనౌన్స్ మెంట్

0
187

 

 

బ్లాక్‌బస్టర్‌ల మాస్ట్రో ఏఆర్ మురుగదాస్, వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరో శివకార్తికేయన్‌ ఒక భారీ ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు. శ్రీ లక్ష్మి మూవీస్ పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించనుంది. దర్శకుడు మురుగదాస్ పుట్టినరోజున అఫీషియల్ గా ఎనౌన్స్ చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ అభిమానులను ఎక్సయిట్ చేసింది.

ఫ్యామిలీ ఆడియన్స్, ముఖ్యంగా పిల్లలలో భారీ ఫాలోయింగ్ ఉన్న హీరో శివకార్తికేయన్, దర్శకుడు ఎఆర్ మురుగదాస్‌తో కలిసి ఉన్న ఫోటోలు తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేయడం ద్వారా వార్తలను అధికారికంగా ధృవీకరించారు. ఇది ఇప్పుడు వైరల్ టాపిక్‌గా మారింది. శివకార్తికేయన్ 23వ ప్రాజెక్ట్ అయిన #SKxARM చిత్రం అతనికి అత్యంత ఎక్స్ పెన్సీవ్ ప్రాజెక్ట్ కానుంది.

 

“డియర్ మురుగదాస్ సార్, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ చిత్రం నాకు అన్ని విధాలా చాలా ప్రత్యేకమైనది. చిత్రీకరణ ప్రారంభించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. చాలా ధన్యవాదాలు సార్. మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు ❤️🤗” అని శివకార్తికేయన్ పోస్ట్ చేశారు

 

దీనిపై దర్శకుడు ఏఆర్ మురుగదాస్ మాట్లాడుతూ.. “థాంక్యూ సో మచ్ శివా! మీతో నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో చేరినందుకు ఆనందంగా ఉంది! కలిసి సినిమాటిక్ మ్యాజిక్‌ను సృష్టిద్దా’ అని అన్నారు

ఎఆర్ మురుగదాస్ మాస్టర్ స్టోరీటెల్లర్, వరుస బ్లాక్‌బస్టర్ హిట్‌లను అందించారు. ఆయన చిత్రాలు మాస్ లీడ్ నటులకే కాదు, ప్రాజెక్ట్‌లో ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా నిలుస్తాయి. ఒక చిన్న విరామం తర్వాత మురుగదాస్ ఇప్పుడు శివకార్తికేయన్ హీరోగా ఒక ప్రామిసింగ్ ప్రాజెక్ట్‌తో తిరిగి వచ్చారు.

 

శివకార్తికేయన్‌తో గతంలో బ్లాక్‌బస్టర్ మాన్ కరాటే చిత్రాన్ని నిర్మించిన మురుగదాస్ తొలిసారిగా శివకార్తికేయన్‌ ని డైరెక్ట్ చేస్తున్నారు.

 

ప్రస్తుతం, ఈ చిత్రం ప్రీప్రొడక్షన్ దశలో ఉంది. ఇతర నటీనటులు, టీం వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

 

తారాగణం: శివకార్తికేయన్

సాంకేతిక విభాగం:

దర్శకత్వం : ఏఆర్ మురుగదాస్

ప్రొడక్షన్ బ్యానర్: శ్రీ లక్ష్మి మూవీస్

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కె

టింగ్: ఫస్ట్ షో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here