సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’ అక్టోబర్ 6న విడుదల కానుంది

0
62

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగు చిత్రసీమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటి. విభిన్న చిత్రాలను అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ నిర్మాణ సంస్థ ఇప్పుడొక యూత్ ఫుల్ అండ్ క్రేజీ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’తో అలరించడానికి వస్తోంది.

ఈ చిత్రం పూర్తిగా యువ తారాగణంతో రూపొందింది. హారిక సూర్యదేవర ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయం అవుతున్నారు. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ వినోదాత్మక చిత్రంలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా నిర్మాతలు ఈ సెన్సేషనల్ క్రేజీ ఎంటర్‌టైనర్‌ను అక్టోబర్ 6న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలు, ఇతర ప్రచార చిత్రాలు ఆకట్టుకొని సినిమాపై ఆసక్తిని పెంచాయి.

ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు.

క్రేజీయెస్ట్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మ్యాడ్ చిత్రం యువతను విశేషంగా ఆకట్టుకొని, బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయమని చిత్ర నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.

తారాగణం & సాంకేతిక నిపుణుల వివరాలు:

తారాగణం: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్, రఘుబాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్, విష్ణు, అంతోనీ, శ్రీకాంత్ రెడ్డి
రచన, దర్శకత్వం: కళ్యాణ్ శంకర్
సమర్పణ: ఎస్. నాగ వంశీ
నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఎడిటర్: నవీన్ నూలి
డీఓపీ: షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి
ఆర్ట్: రామ్ అరసవిల్లి
అడిషనల్ స్క్రీన్ ప్లే: ప్రవీణ్ పట్టు, ప్రణయ్ రావు తక్కళ్లపల్లి
ఫైట్ మాస్టర్: కరుణాకర్
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here