దర్శకుడు శ్రీను వైట్లకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన #గోపీచంద్32 టీమ్, రెగ్యులర్ షూటింగ్ రేపు ఇటలీలో ప్రారంభం

0
36
మాచో స్టార్ గోపీచంద్‌తో దర్శకుడు శ్రీను వైట్ల కొత్త చిత్రం ఇటివలే అనౌన్స్ చేశారు. అదే రోజు ముహూర్తం వేడుక కూడా గ్రాండ్ గా జరిగింది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వేణు దోనేపూడి ఈ చిత్రాన్ని చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై ఫస్ట్‌క్లాస్ ప్రొడక్షన్, టెక్నికల్ స్టాండర్డ్స్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

దర్శకుడు శ్రీను వైట్లకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, మేకర్స్ ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసారు. ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమయ్యే సౌత్ ఇటలీలోని మాటెరాలో కొన్ని అద్భుతమైన ప్రదేశాలను దర్శకుడు శ్రీనువైట్ల ఎక్సప్లోర్ చేయడం వీడియోలో చూడవచ్చు. ఈ హై-వోల్టేజ్ యాక్షనర్ ప్రొడక్షన్ పార్ట్ రేపటి నుండి ప్రారంభమవుతుంది.

https://twitter.com/baraju_superhit/status/1705820100992057699?s=46

సినిమా చాలా భాగం విదేశాల్లోని కొన్ని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించనున్నారు.

శ్రీనువైట్ల పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. కెవి గుహన్ డీవోపీగా పని చేస్తుండగా చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర వివరాలు మేకర్స్ త్వరలో తెలియకజేస్తారు.

నటీనటులు: ‘మాచో స్టార్’ గోపీచంద్
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: శ్రీను వైట్ల
నిర్మాత: వేణు దోనేపూడి
బ్యానర్: చిత్రాలయం స్టూడియోస్
స్క్రీన్ ప్లే: గోపీ మోహన్
సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్
సంగీతం: చైతన్ భరద్వాజ్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here