యంగ్ టాలెంటెడ్ విరాట్ కర్ణ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’. ‘అఖండ’తో బ్లాక్‌బస్టర్ ను అందించిన ద్వారకా క్రియేషన్స్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఇటివలే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలని పెంచింది. సెప్టెంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో విరాట్ కర్ణ మాట్లాడుతూ.. మా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గారు నా పై నమ్మకంతో ఇంత పెద్ద సినిమాలో ఇంత మంచి పాత్ర ఇచ్చారు. పెదకాపు అంటే సామాన్యుడి సంతకం. ఆ పాత్రకు నేను సెట్ అవుతానని ఈ సినిమా నాకు ఇచ్చినందుకు శ్రీకాంత్ గారికి కృతజ్ఞతలు. నేను హీరోగా ఇంత పెద్ద సినిమాని నిర్మించిన మా బావగారికి జీవితాంతం రుణపడి వుంటాను. మొదటి సినిమా అందరికీ మెమరబుల్. అలాంటి మెమరీస్ అన్నీ ఇందులో వున్నాయి,. వీటన్నిటికీ కారణం మా దర్శకుడు శ్రీకాంత్ గారు. చోటా కె నాయుడు గారు నన్ను చాలా అందంగా చూపించారు. చాలా ప్రోత్సహించారు. ఈ సినిమాలో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. నేను కూడా ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ లానే చేశాను. అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. ప్రగతి చాలా మంచి కోస్టార్. బ్రిగడ చాలా మంచి పాత్ర చేసింది. మిక్కీ జే మేయర్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. కళ్యాణ్ చక్రవర్తి చాలా మంచి పాటలు రాశారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. సెప్టెంబర్ 29న సినిమా వస్తోంది. మీరంతా తప్పకుండా చూస్తారని కోరుకుంటున్నాను. చాలా కష్టపడి ఇష్టపడి ఈ సినిమా చేశాం. మా కష్టానికి తగిన ఫలితం మీరు ఇస్తారని, ఆ ఫలితం మాకు ఆనందాన్ని ఇస్తుందని కోరుకుంటున్నాను.
శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ.. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ధన్యవాదాలు. విరాట్ .. కొత్త కుర్రాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇందులో కొత్తగా ఫీలవ్వొద్దని విరాట్ కి కూడా చెప్పాను. ఒక కొత్తకుర్రాడిగా నువ్వు చేస్తేనే ఈ కథ అందరికీ దగ్గర అవుతుందని చెప్పాను. దీనికి సామాన్యుడి సంతకం అని వూరికే పెట్టలేదు. ఇది విరాట్ కోసం పుట్టిందని తనతో తొలిసారి మాట్లాడినప్పుడు చెప్పాను. ఒక కొత్త హీరోతో ఇలాంటి కొత్త కథ చేసినప్పుడు ఒక నిర్మాత దన్ను ఇచ్చినపుడు .. దర్శకుడిగా అందరి తరుపున నిలబడి సినిమా చేసిన పేరుని ఎందుకు వొదులుకోవాలి. ఎప్పుడైనా ప్రోత్సాహం ఉంటేనే ఉత్సాహం వుంటుంది. ఇందులో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. పెదకాపు జర్నీ చాలా బావుంది. జర్నీ ఇంకా వుంది. ఈ సినిమా మిమ్మల్ని అలరిస్తుందని నచ్చుతుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. పెదకాపు-1 నా నాల్గవ సినిమా. గతంలో చేసిన మూడు సినిమాలు వేరు .. పెదకాపు వేరు. ఈ సినిమాతో చాలా రోజులు జర్నీ చేశాను. ఈ జర్నీ నాతో పాటు ప్రయాణించిన అందరికీ థాంక్స్ చెప్పడం నా బాధ్యత. నాగేశ్వరరావు గారు ప్రొడక్షన్ సైడ్ అన్నీ చక్కగా చూసుకునేవారు. తనకి సినిమా అంటే చాలా ఇష్టం. ఛోటా గారు ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. ఈ ప్రయాణంలో ఆయనపై గౌరవం పెరిగింది. మనకి బయట కనిపించే చోటా వేరు లొకేషన్ లో చోటా వేరు. పని పట్ల చాలా అంకితభావంతో వుంటారు. భవిష్యత్ లో సినిమా తీస్తే నా మొదటి ఆప్షన్ ఆయనే. పీటర్ మాస్టర్ మరో మెయిన్ పిల్లర్. ఆయనకి సినిమా తప్ప మరో ఆలోచన వుండదు. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. మిక్కీ జే మేయర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. టీజర్, ట్రైలర్ ని భాస్కర్ అద్భుతంగా కట్ చేశాడు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గురించి ఒక్క మాట చాలా నమ్మకంగా చెబుతున్నాను. పెదకాపు విడుదలైన తర్వాత తెలుగు సినిమాకి మరో వెట్రిమారన్ వస్తారు. శ్రీకాంత్ గారికి ఎప్పుడూ కృతజ్ఞత తో వుంటాను. ఇందులో నటీనటులంతా వారి పాత్రల్లో జీవించారు. రావు రమేష్ గారికి తప్పితే ఈ సినిమాలో నటించిన దాదాపు అందరికీ షూటింగ్ లో గాయాలయ్యాయి. చాలా హార్డ్ వర్క్ చేసి తమ బెస్ట్ ఇచ్చారు. విరాట్ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తొలి రోజు షూటింగ్ లో సీన్ అయిపోయిన తర్వాత షర్టు తీస్తే శరీరం అంతా గాయాలు కనిపించాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వరకూ విరాట్ ఒంటిపై మచ్చలేని రోజు లేదు. అంతకష్టపడ్డాడు. తనకి సినిమా అంటే చాలా ఇష్టం. సినిమాపై ఆసక్తితో తన స్నేహితులతో కలిసి ఒక షో చేసుకున్నాడు. అది రామానాయడు స్టూడియో చూసినపుడు.. తను ఫస్ట్ టైం ఆర్టిస్ట్ లా కాకుండా అనుభవం వున్న నటుడిలా కనిపించాడు. ఇప్పుడు పెదకాపు టీజర్ ట్రైలర్ చూసిన ఆడియన్స్ ఎలా ఫీలౌతున్నారో నేను ఆ రోజు అలానే ఫీలయ్యాను. ఆ రోజే తను హీరో మెటిరియల్ అని అనుకున్నాను. ఒక హీరోని ఇండస్ట్రీకి పరిచయం చేయాలంటే శ్రీకాంత్ గారి కంటే మంచి దర్శకుడు ఎవరుంటారు. విరాట్ పర్సనాలిటీకి ఒక యాక్షన్ తరహా కథ అయితే బావుంటుందనిపించింది. అప్పుడు ఈ పెదకాపు కథ చెప్పారు. చెప్పిన వెంటనే ఇదే కథతో సినిమా చేస్తున్నామని చెప్పాను. అలా పెదకాపు మొదలైయింది. కొత్త హీరోతో ఇంతపెద్ద కాన్వాస్ తో సినిమా చేయడం ఎలా అనే మీమాంశ ఏ దర్శకుడికైనా వుంటుంది. ఈ కథని బలంగా నమ్మాం. ఎలాంటి సరిహద్దులు లేకుండా ఈ కథ ఏది కోరుకుంటుందో, ఒక రామ్ చరణ్, ఒక ఎన్టీఆర్ తో చేస్తే ఎలా వుంటుందో.. అలానే చేద్దామని శ్రీకాంత్ గారితో చెప్పాను. అవసరమైతే ఒక ఎపిసోడ్ షూట్ చేసి మనం అనుకున్న అవుట్ పుట్ కి మ్యాచ్ కాకపొతే యూనిట్ అందరినీ అలానే వుంచి హీరోని మార్చి మరో హీరోని పెడదాం గానీ సినిమాకి మాత్రం బౌండరీలు గీసుకోవద్దని చెప్పాను. ఆ రోజు నుంచి సినిమా విషయంలో వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇందులో కొత్త హీరోని పరిచయం చేయడానికి కూడా కారణం .. మేము తీసుకున్న కథ, నేపధ్యం. 294 మంది కొత్తవారిని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న సందర్భం. ఈ కథ విరాట్ కోసం పుట్టిందని భావిస్తున్నాను. నాకు 7 ఏళ్ల బాబు వున్నాడు. పదేళ్ళ తర్వాత వాడికి సినిమాపై ఆసక్తికలిగి హీరోగా లాంచ్ చేయాలన్నా ఇలాంటి మంచి కథ, దర్శకుడు దొరుకుతారని చెప్పలేను. ఒక సామాన్యుడు తన పరిస్థితులని తట్టుకొని బలవంతుడిని జయించాలంటే ఒక యుద్ధమే చేయాలి. ఆ యుద్ధంలోకి దిగిన తర్వాత వెనకడుగువేయకూడదు. మనం అనుకున్నది సాధించాలంటే పోరాటం తప్పితే వేరే మార్గం వుండదు. అదే ఈ సినిమా కథ. ఈ పెదకాపు మీరు ఇచ్చే సక్సెస్ బట్టి ద్వారక క్రియేషన్స్ జర్నీ వుంటుంది. అది మీ చేతుల్లోనే వుంది. మీరు ఏది ఇచ్చిన తీసుకోవడానికి సిద్ధంగా వుంటాను. ఒక మనిషి కావచ్చు.. కుటుంబం, సమూహం, ప్రాంతం.. కావచ్చు. నా అనుకొనే వారికోసం కాపుకాచుకొని వుండే ప్రతి కాపు కి ఈ సినిమా అంకితం.’ అన్నారు.
ప్రగతి శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ఈ సినిమాలో భాగం కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం అందరూ చాలా కష్టపడ్డారు. ఛోటా గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. విరాట్ లాంటి బ్రిలియంట్ యాక్టర్ తో స్క్రీన్ పంచుకోవడం అనందంగా వుంది. టీం అందరికీ థాంక్స్’ తెలిపారు.
మల్లిడి వశిష్ట మాట్లాడుతూ.. శ్రీకాంత్ గారి సినిమాలంటే అభిమానం. ఆయన సినిమాలు ఆహ్లాదకరంగా వుంటాయి. ఇప్పుడు పెదకాపు లో పూర్తి వైవిధ్యం కనిపిస్తోంది. శ్రీకాంత్ గారు షాక్ ఇచ్చారు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ విజయం అవ్వాలని కోరుకుంటున్నాను. విరాట్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. తప్పకుండా 29న విరాట్ తన బావ కళ్ళలో ఆనందం చూస్తారు. చోటా గారు విజువల్స్ అద్భుతంగా చూపించారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు.
సత్యనంద్ మాట్లాడుతూ.. ప్రభాస్ ని మొదటిసారి నన్ను కలిసినప్పుడు ఎలాంటి అభిప్రాయం ఏర్పడిందో.. మొదటిసారి విరాట్ ని కలిసినప్పుడు అలాంటి అభిప్రాయం కలిగింది. ఇదే విషయం ప్రభాస్ గారికి చెప్పాను. ఆయన చాలా ఆనందపడి విరాట్ కి విజయం రావాలని కోరుకున్నారు. శ్రీకాంత్ గారి దర్శకత్వంలో నా శిష్యులు మహేష్ బాబు, వరుణ్ తేజ్ నటించారు. ఇప్పుడు మూడో హీరో విరాట్ కర్ణ. శ్రీకాంత్ గారు ముట్టుకున్నది బంగారం. శ్రీకాంత్ గారి దర్శకత్వంలో విరాట్ ని లాంచ్ చేసినందుకు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి గారికి థాంక్స్. ఈ సినిమా విరాట్ కి సినీ పరిశ్రమలో గొప్ప ఆరంభాన్ని ఇస్తుందనే నమ్మకం వుంది’’ అన్నారు.
రావు రమేష్ మాట్లాడుతూ.. పెదకాపు టీజర్ ట్రైలర్ చాలా మాట్లాడాయి. ఈ సినిమా శ్రీకాంత్ అడ్డాల గారు చేయడం వలన ఒక ప్రత్యేకతని సంతరించుకుంది. ఈ కథ అడిగినట్లే ఆయన చేశారు. నిజాయితీగా చేశారు. ఛోటా గారి విజువల్స్ అద్భుతంగా వున్నాయి. మిక్కీ జే మేయర్ గారి సౌండింగ్ .. ఇలా అందరూ కొత్తగా ఆవిష్కరించుకున్నారు. శ్రీకాంత్ అడ్డాల గారి నటుడిగా కూడా చాలా మంచి పేరు వస్తుంది. ఈ ట్రైలర్ చూసి అందరూ విరాట్ గురించి అద్భుతంగా చేశాడని మాట్లాడుకుంటున్నారు. చాలా పెద్ద హిట్ వచ్చి చాలా పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్నాను. రవీందర్ రెడ్డిగారు ఖర్చుకి వెనకాడకుండా ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాలో పని చేసిన అందరూ అద్భుతంగా చేశారు. ఈ సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది’’ అన్నారు.
ఛోటా కె నాయుడు మాట్లాడుతూ.. శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాతో మా అందరి వ్యూస్ మార్చేశాడు. నా అంచనాలు తలకిందులు చేసే కొత్త కాన్సెప్ట్ తో వచ్చారు. కథ స్క్రీన్ ప్లే మాటలు యాక్టింగ్ అన్నీ అద్భుతం. నా సినిమా కెరీర్ లో మొత్తం నన్ను ఎక్కువగా సర్ ప్రైజ్ చేసిన పెదకాపు-1. ఈ సినిమాలో పని చేసిన ప్రతి నటీనటులు వారి పాత్రని అద్భుతంగా చేశారు. మిర్యాల రవీందర్ రెడ్డి గారు సినిమాపై ప్యాషన్ వున్న నిర్మాత. ఈ సినిమాని ఎక్కడా రాజీపడకుండా భారీ బడ్జెట్ తో నిర్మించారు. విరాట్ ని అందరూ ప్రభాస్ తో పోల్చడం ఆనందంగా వుంది. చాలా అద్భుతంగా చేశాడు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం వుంది’’ అన్నారు.
Happy & bright faces all over 🤩, Here are some candid clicks from the grand pre-release event of #PeddhaKapu1
In cinemas #PeddhaKapu1OnSep29th 🔥@ViratKarrna @officialpragati @SrikanthAddala_ @MickeyJMeyer @Editormarthand @NaiduChota @anusuyakhasba @dwarakacreation pic.twitter.com/IgaJG1joyn
— BA Raju's Team (@baraju_SuperHit) September 23, 2023
అనసూయ భరద్వాజ్ మాట్లాడుతూ.. పెదకాపు తో నాకు కొత్త గౌరవం వస్తుందనే నమ్మకం వుంది. సినిమా చూసిన తర్వాత అది మీరు ఏకీభవిస్తారు. ఇందులో అక్కమ్మ అనే అద్భుతమైన పాత్ర ఇచ్చిన శ్రీకాంత్ గారికి థాంక్స్. ఈ సినిమాతో నన్ను అందరూ అదే పేరుతో పిలుస్తారనే నమ్మకం వుంది. నిర్మాత రవీందర్ రెడ్డి గారి కృతజ్ఞతలు. మిక్కీ జే మేయర్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాతో కొత్త శ్రీకాంత్ అడ్దాల గారిని చూస్తారు. ఆయన నటన కూడా అద్భుతంగా చేశారు. విరాట్ ని అందరూ ప్రభాస్ తో పోలుస్తున్నారు. తను కూడా చాలా కష్టపడ్డారు. తప్పకుండా బిగ్ స్టార్ అవుతారు. ప్రగతి, బ్రిగడ అందరూ చాలా అద్భుతంగా నటించారు. 29న థియేటర్స్ లో కలుద్దాం’’ అన్నారు.
బ్రిగడ మాట్లాడుతూ.. ఈ సినిమాలో భాగం కావడం చాలా అనందంగా వుంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఇందులో నేను చేసిన పాత్ర నాకు చాలా ప్రత్యేకం. ఈ సినిమా కోసం అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. మీ అందరికీ ప్రోత్సహం కావాలి’’ అని కోరారు.
అడుకలం నరేన్, కళ్యాణ్ చక్రవర్తి, శ్రీనివాస్ వడ్లమాణి, విజయ్ రామరాజు, ప్రవీణ్ యండమూరి, వికాస్, చిత్ర యూనిట్ సభ్యులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.