‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి‘ ప్రమోషన్ లో భాగంగా ఒక యూనిక్ కాన్సెప్ట్ తో ముందుకొచ్చింది హీరోయిన్ అనుష్క శెట్టి. ఈ సినిమాలో చెఫ్ అన్విత రవళి శెట్టి క్యారెక్టర్ లో నటించిన అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్ ప్రారంభించింది. ఈ సందర్భంగా తనకు ఇష్టమైన వంటలు మంగళూరు చికెన్ కర్రీ, మంగళూరు స్పెషల్ నీర్ దోస రెసిపీలను ఎలా తయారు చేయాలో తన సోషల్ మీడియా అక్కౌంట్ ద్వారా పోస్ట్ చేసింది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్ ను మొదటగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు విసిరింది. ప్రభాస్ ఎంత ఫుడ్ లవర్ అనేది అందరికీ తెలుసు. ఆయన ఇష్టంగా తినడమే కాదు..తన కో స్టార్స్ కు, స్నేహితులకు మంచి మంచి వంటలు రుచి చూపిస్తుంటారు. అందుకే ఫస్ట్ ప్రభాస్ కు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్ విసిరినట్లు అనుష్క తెలిపింది.
అనుష్క విసిరిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్ తీసుకున్న ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా తనకు ప్రాన్స్ పలావ్ ఇష్టమని చెబుతూ ఎలా తయారు చేయాలో వివరించారు. ఎంతోకాలంగా అనుష్క తో తనకు పరిచయం ఉన్నా ఆమె ఫేవరేట్ డిష్ తనకు తెలియదని, ఇప్పుడు తెలిసిందని ప్రభాస్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్ ను రామ్ చరణ్ కు ఫార్వార్డ్ చేశారు ప్రభాస్.
.Rebel star #Prabhas accepts Anvitha's challenge and showcases his culinary expertise 🤩❤️
And also extends the #MSMPRecipeChallenge to Megapowerstar @AlwaysRamCharan 🤩#MissShettyMrPolishetty Grand release on Sep 7th! #MSMPonSep7th#MSMP Bookings open now… pic.twitter.com/2n89OnhPoy— BA Raju's Team (@baraju_SuperHit) September 5, 2023
సూపర్ హిట్ పెయిర్ అయిన ప్రభాస్, అనుష్క టాలీవుడ్ లో బిల్లా, మిర్చి, బాహుబలి1, బాహుబలి 2 చిత్రాల్లో కలిసి నటించి ఆడియెన్స్ ఫేవరేట్ జోడీ అయ్యారు. ఈ స్నేహంతో అనుష్క హీరోయిన్ గా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ప్రమోషన్ కు సపోర్ట్ చేస్తున్నారు ప్రభాస్.
ప్రేక్షకులను కూడా అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్ తీసుకోవాలని కోరింది. వాళ్లు తమకు నచ్చిన రెసిపీని, వాటిని తయారుచేసే పద్ధతిని పోస్ట్ చేయాలని చెప్పింది. ఈ ఛాలెంజ్ ను తమ ఫ్రెండ్స్ కు ఫార్వార్డ్ చేయమని అనుష్క కోరింది. నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేషన్‌లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై మహేష్ బాబు.పి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈ నెల 7వ తేదీన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.