కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పాటలో రవితేజ.. తన ప్రేయసి పాత్రని పోషించిన నూపుర్ సనన్ ని ఆట పట్టిస్తూ కనిపించారు. పాపులర్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ట్రాక్‌లోని ఎనర్జిటిక్ బీట్‌లకు సరిగ్గా సరిపోయే ఎలక్ట్రిఫైయింగ్, ట్రెండీ హుక్ స్టెప్‌ను క్రియేట్ చేశారు. రవితేజ యంగ్ గా కనిపించారు. రవితేజ డ్యాన్స్ యూత్, మాస్‌ని ఖచ్చితంగా మెప్పిస్తుంది. కాస్ట్యూమ్స్, సెట్లు కూడా రెట్రో అనుభూతిని పెంచుతాయి. ఈ పాటకు ఇన్స్టంట్ రెస్పాన్స్ వస్తోంది. రాబోయే రోజుల్లో మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానానికి చేరుకుంటుంది.
ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కి వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. వరుసగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 చిత్రాలను రూపొందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ గ్రాండ్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్ మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఆర్ మదీ ఐఎస్‌సి, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ కాగా, మయాంక్ సింఘానియా సహ నిర్మాత.
దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న విడుదల చేస్తున్నారు.
తారాగణం: రవితేజ, నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: వంశీ
నిర్మాత: అభిషేక్ అగర్వాల్
బ్యానర్: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
సమర్పణ: తేజ్ నారాయణ్ అగర్వాల్
సహ నిర్మాత: మయాంక్ సింఘానియా
డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: ఆర్ మదీ
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
పీఆర్వో: వంశీ-శేఖర్



