జాతీయ అవార్డ్స్ విజేతలందరికీ అభినందనలు : నిర్మాత దిల్ రాజు

0
538
Producer Dil Raju Stills @ F3 Movie Interview

జాతీయ అవార్డ్స్ విజేతలందరికీ అభినందనలు : నిర్మాత దిల్ రాజు

69వ జాతీయ అవార్డ్స్ విజేతలందరికీ అభినందనలు. జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ పొందిన అల్లు అర్జున్ గారికి అభినందనలు. ఫస్ట్ టైమ్ ఒక తెలుగు హీరోకి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడం అల్లు అర్జున్ గారికి తెలుగు చిత్ర పరిశ్రమకు గ్రేట్ మూమెంట్. జాతీయ అవార్డులు పొందిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ అందరికీ పేరుపేరునా అభినందనలు.  రాజమౌళి గారు ప్రతి సినిమాతో తెలుగు సినిమాని మరోస్థాయికి తీసుకెళుతున్నారు. అందుకు రాజమౌళి గారికి ప్రత్యేక అభినందనలు. దేవీశ్రీ ప్రసాద్ గారికి స్పెషల్ కంగ్రాజులేషన్స్. దేవిశ్రీ తో మాది గ్రేట్ జర్నీ. ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేశాం. పుష్ప సినిమాకి దేవిశ్రీ కి నేషనల్ అవార్డ్ రావడం చాలా అనందంగా వుంది. ఉప్పెన చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, దర్శకుడు బుచ్చిబాబు, టీం అందరికీ అభినందనలు. మొదటి సినిమాతోనే బుచ్చిబాబుకు, అలాగే ఫస్ట్ టైం మైత్రీ మూవీ మేకర్స్ కి నేషనల్ అవార్డ్ రావడం చాలా అనందంగా వుంది. కొండపొలం సినిమాలోని పాటకు అవార్డ్ పొందిన చంద్రబోస్ గారికి అభినందనలు. మొన్ననే ఆస్కార్ అవార్డ్ తీసుకొచ్చారు. ఇప్పుడు నేషనల్ అవార్డ్ తీసుకోబోతున్నారు. తెలుగు సినిమాకి ఇన్ని అవార్డులు రావడం, ఇవాళ ఇండియన్ సినిమాలో తెలుగు సినిమాకి ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేసిన మీ అందరికీ ధన్యవాదాలు, అభినందనలు’’
-నిర్మాత దిల్ రాజు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here