చంద్రయాన్-3 విజయం భారతీయులందరు గర్వించదగ్గ విషయం – తెలుగు నిర్మాతల మండలి

0
124

ఇప్పటి వరకు ఏ దేశము అందుకోలేకపోయిన సంక్లిష్ట లక్ష్యాన్నిఛేదించి చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడి దక్షిణ ధ్రువ ఉపరితలంపై అడుగుపెట్టడం భారతీయులందరు గర్వించదగ్గ విషయమని, చంద్రయాన్ -3 తో సరికొత్త చరిత్ర లిఖించామని, ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావానికి ఇవి ప్రణామాలని, ఇది భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ విజయమని తెలుగు చలన చిత్ర పరిశ్రమ  పేర్కొనుచున్నది.
భవిష్యత్తులో మన దేశం చేపట్టబోయే అన్ని ప్రయోగాలకు ఈ విజయం ప్రేరణ ఇస్తుందని, ఈ సందర్భంగా అవిరళ కృషి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు, సిబ్బందికి తెలుగు చలన చిత్ర పరిశ్రమ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియచేయుచున్నది.

అధ్యక్షులు
వి. వెంకట రమణారెడ్డి (దిల్ రాజు)

గౌరవ కార్యదర్శులు
కె.ఎల్. దామోదర ప్రసాద్, కె. శివప్రసాద రావు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here