‘మార్క్ ఆంటోని’ ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్.. తెలుగులో తొలిసారి పాట పాడిన విశాల్

0
168

 

వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో విశాల్.. పలు యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మాస్ ఆడియన్స్ మెప్పు పొందుతున్నారు. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న ఈ హీరో ఇప్పుడు ‘మార్క్ ఆంటోనీ’ అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌ గా ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో విశాల్ కి జోడీగా రీతూ వర్మ నటిస్తోంది. ఎస్.జె.సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్ వినోద్ కుమార్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

ప్రస్తుతం చివరి దశ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వినాయక చవితి పండుగను పురస్కరించుకుని సెప్టెంబర్ 15న విడుదల చేయబోతున్నట్లుగా
ఇప్పటికే మేకర్స్ తెలిపారు. ఇందులో భాగంగా చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన టీం.. తాజాగా ఈ సినిమా నుంచి విశాల్ ఆలపించిన అదరద సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. అదరద గుండె అదరద మావా.. బెదరగ బెంగ మొదలవదా అంటూ సాగిపోతున్న ఈ పాటను విశాల్ ఫుల్ ఎనర్జీతో పాడారు. దీంతో ఈ సాంగ్ ప్రోమో క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ ‘మార్క్ ఆంటోని’ మూవీలో విశాల్ పాడిన ఈ సాంగ్ హైలైట్ కానుందట.

ఇకపోతే ఇటీవల రిలీజైన ఈ మూవీ టీజర్ కు అద్భుతమైన స్పందన లభించింది. విశాల్ ఇందులో సరికొత్తగా కనిపించారు. గుబురు గడ్డంతో ఫైర్ చేస్తున్న విశాల్ లుక్ మరియు ఎస్.జె.సూర్య కామెడి టైమింగ్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రానికి సంగీతం జి.వి. ప్రకాష్ అందిస్తుండగా, యాక్షన్ సన్నివేశాలు పీటర్ హెయిన్స్, దిలీప్ సుబ్బరాయన్, కనల్ కణ్ణన్, దినేష్ సుబ్బరాయన్, సినిమాటోగ్రఫీ అభినందన్ రామానుజం, ఎడిటర్ విజయ్ వేలుకుట్టి బాధ్యతలు తీసుకున్నారు.

మార్క్ ఆంటోనీ టైమ్ ట్రావెల్ థీమ్ చుట్టూ తిరిగే కథ. భారీ యాక్షన్ సన్నివేశాలు, సైన్స్ ఫిక్షన్ అంశాలతో, అక్కడక్కడ ఎస్.జె.సూర్య కామెడీ టైమింతో ఈ చిత్రం ఆద్యంతం అందరినీ అలరించనుంది. చిత్ర ప్రమోషన్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన టీం.. ఎప్పటికప్పుడు సినిమాపై హైప్ పెంచే అప్ డేట్స్ వదులుతున్నారు.

సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకుడు: అధిక్ రవిచంద్రన్
నిర్మాత: ఎస్ వినోద్ కుమార్
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
ఫైట్స్: పీటర్ హెయిన్స్, దిలీప్ సుబ్బరాయన్, కనల్ కణ్ణన్, దినేష్ సుబ్బరాయన్
డి.ఓ.పి: అభినందన్ రామానుజం
ఎడిటర్: విజయ్ వేలుకుట్టి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here