దిగ్దర్శకుడు కె.బాలచందర్ “జయంతి” (జులై 9) సందర్భంగాదేవీ ప్రసాద్. నివాళి

0
277

అందరూ రాతిలో శిల్పాన్ని చూడలేరు.
ఓ శిల లోని వ్యర్ధాలన్నిటినీ తన ఉలి తో చెక్కి అందమైన శిల్పంలా మారుస్తాడు ప్రతిభావంతుడైన శిల్పి. తర్వాత అందరూ ఆ శిల్పంతో సెల్ఫీలు తీసుకుని ఆనందిస్తారు.

సినిమాల్లోనూ అంతే.

అందరు దర్శకులూ నటీనటులను తయారు చేయలేరు.

“కె.బాలచందర్”గారిలాంటి దర్శకశిల్పులు ఎందరోనటీనటులను తమ ప్రతిభతో తీర్చిదిద్ది వెండితెరపై నిలబెడితే తర్వాత అందరూ వారితో సినిమాలు తీస్తారు.

అలాంటి స్వయంప్రకాశకుల వల్లనే సినిమా పరిశ్రమ శాఖోపశాఖలుగా విస్తరించి మహావృక్షమవుతూవుంటుంది.

ఆ దిగ్దర్శకుని “జయంతి” (జులై 9) సందర్భంగా నా నివాళి.

(నేను గీసిన ఈ పెయింటింగ్ ఆ దర్శకశిఖరానికి బహూకరించడం నాకు దక్కిన అరుదైన అదృష్టం.)

———- దేవీ ప్రసాద్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here