ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య లు కలిసి నటించిన మూవీ బేబీ.కలర్ ఫోటో లాంటి నేషనల్ అవార్డ్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన సాయి రాజేష్ దర్శకత్వంలో బేబీ అనే సినిమా చేస్తున్నారు.
ఇక ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ నుంచి విడుదలైన టీజర్ మరియు సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి మొదటి వీడియో గ్లిమ్స్ వచ్చిన దగ్గరి నుంచే ఈ చిత్రం పైన ప్రేక్షకులందరికీ ఆసక్తి నెలకొంది. ఇక ఆ తర్వాత వచ్చిన ప్రతి సాంగ్ తెలుగు సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంటూ వచ్చింది. దీంతో ఈ చిత్రంపై ఎక్స్పెక్టేషన్స్ రెట్టింపు అవ్వ సాగాయి.
ఇక ఇప్పుడు ఆనంద్ దేవరకొండ తో విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ ‘బేబీ’ మూవీ విడుదలకు సిద్ధమైపోయింది. ఈ సినిమా జూలై 14న విడుదల కానుంది. ఇదే విషయాన్ని ప్రసాద్ ఐ-మాక్స్ దగ్గర దాదాపు 70 అడుగుల విడుదల తేదీ పోస్టర్ తో ప్రకటించారు ఈ సినిమా యూనిట్. ఈ చిత్రం టీజర్ మరియు సాంగ్స్ లాగానే కొత్త పోస్టర్ డిఫరెంట్ గా, సినీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది.
Exhilaration for #BabyTheMovie is touching new heights! ❤️🔥 #BabyOnJuly14 is Trending Indiawide along with our #BroTeaser 🤩
Mark your calendars Now ✅
In theaters, From July 14th! 📣@ananddeverkonda @iamvaishnavi04 @viraj_ashwin @sairazesh @VijaiBulganin @SKNonline pic.twitter.com/9Cpg6BcXXh— BA Raju's Team (@baraju_SuperHit) June 29, 2023
ఈ విడుదల తేదీ పోస్టర్ లాంచ్ కి ఆనంద్ దేవరకొండ,విరాజ్ అశ్విన్ ,వైష్ణవి చైతన్యలతో పాటు ఈ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ అలానే ఈ సినిమా నిర్మాత ఎస్ కే ఎన్, కో ప్రొడ్యూసర్ ధీరజ్ అటెండ్ అయ్యారు. ఒక ఇంటెన్స్ లవ్ స్టొరీ తో అందరికీ నచ్చే అంశాలతో జూలై 14న ప్రేక్షుకుల ముందుకు రాబోతున్నట్టు తెలిపింది టీమ్.
అయితే విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో, ఈ చిత్ర యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ని వచ్చే వారంలో విడుదల చేయనున్నట్టు, అలానే ఈ చిత్ర ప్రమోషన్స్ని ఇక జోరుగా కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ చిత్రాన్ని సాయిరాజేశ్ డైరెక్ట్ చేశారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. ఎస్‌కేఎన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకి ఎడిటింగ్ : విప్లవ్ నైషధం, సినిమాటోగ్రఫీ : ఎమ్ఎన్ బాల్ రెడ్డి అందిస్తున్నారు.