విశ్వక్ సేన్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘VS11’లో రత్నమాలగా విలక్షణ నటి అంజలి

0
102

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అత్యంత వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తోంది. నిర్మాతలు సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్యలు గొప్ప అభిరుచితో నిర్మిస్తున్న చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.

ఇప్పుడు ఈ ప్రముఖ నిర్మాణ సంస్థ నుంచి ఆసక్తికరమైన చిత్రం ‘VS 11’ వస్తోంది. ఈ సినిమాలో బహుముఖ ప్రతిభావంతుడు, యంగ్ అండ్ డైనమిక్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్నారు.

ఈ యాక్షన్ డ్రామా చిత్రంలో యువ నటుడు విశ్వక్ సేన్ క్రూరమైన పాత్రను పోషిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య రచయితగా, దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

విలక్షణ నటి అంజలి పుట్టినరోజు(జూన్ 16) సందర్భంగా ఈ సినిమా నుంచి ఆమె ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమాలో ఆమె రత్నమాలగా కనిపించనున్నారు.

అంజలి ఉత్తమమైన పాత్రలను, స్క్రిప్ట్‌లను ఎంచుకుంటారు. ఆమెకు ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ ఉంది. రత్నమాలగా ఆమె మాస్‌ ప్రేక్షకులను అలరించనున్నారు.

లిటిల్ మేస్ట్రో యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఆయన సంగీతం సినిమాలకు ప్రధాన బలంగా నిలుస్తుందని చిత్ర బృందం చెబుతోంది.

ఇప్పటికే విడుదలైన విశ్వక్ సేన్ గంగానమ్మ జాతర, రాగ్స్ టు రిచ్స్ పోస్టర్లు విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచేశాయి. క్రూరమైన వ్యక్తి కథను చూసేందుకు సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

తారాగణం: విశ్వక్ సేన్
దర్శకత్వం: కృష్ణ చైతన్య
సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా
ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్
సినిమాటోగ్రాఫర్: అనిత్ మధాది
ఎడిటర్: నవీన్ నూలి
సహ నిర్మాతలు: వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌
పీఆర్ఓ: లక్ష్మివేణుగోపాల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here