టైటిల్: అనంత
నటీనటులు: ప్రశాంత్ కార్తీ, రిత్తిక చక్రవర్తి, అనీష్ కురువెళ్ళ, గెడ్డం శ్రీనివాస్, లయ సింప్సన్ తదితరులు
నిర్మాణ సంస్థ: శ్రినేత్ర క్రియేషన్స్
నిర్మాత : ప్రశాంత్ కార్తీ
దర్శకత్వం: మదు బాబు తోకల
సంగీతం: ఘంటశాల విశ్వనాథ్
విడుదల తేది: జూన్ 9, 2023
కథ :
రదేశ్ (ప్రశాంత్ కార్తి) ఒక ప్రొఫెసర్. ప్రతి పదేళ్లకు ఒకసారి అతను పనిచేసే యూనివర్సిటీ మారిపోతుంటాడు. అలా ప్రస్తుతం అతను పని చేసే యూనివర్సీటీ నుంచి వెళ్తున్న క్రమంలో అతనికి వీడ్కోలు చెప్పడానికి వచ్చిన సైటిస్టులు ప్రద్యుమ్న (అనీష్ కురువెళ్ళ), ధర్మా (గెడ్డం శ్రీనివాస్), శృతీ (రిత్తిక చక్రవర్తి) తదితరులు రదేశ్ ఇంటికి వస్తారు. అసలు ఈ యూనివర్సీటీ నుంచి ఎందుకు వెళ్తున్నావని రదేశ్‌ని ప్రశ్నించడంలో అసలు కథ ప్రారంభం అవుతుంది. రదేశ్ 15 వేల సంవత్సరాల క్రితం పుట్టిన వ్యక్తి. అతనికి మరణం ఉండడు.. వయసు పెరగదు. అతని వయసు గుర్తించేలోపు ఆ ప్రదేశం నుంచి వెళ్లి పోతుంటాడు. ఇదంతా ఆ సైంటిస్టులకు వివరిస్తాడు రదేశ్. అసలు రదేశ్ ఎవరు? నిజంగానే అతను 15 వేల సంవత్సరాల క్రితం పుట్టాడా? ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ప్రద్యుమ్నకు రదేశ్ మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే అనంత సినిమా చూడాల్సిందే.
నటీనటుల పనితీరు:
గతంలో రామ్ గోపాల్ వర్మ రూపొందించిన కొండా చిత్రంలో నక్సలైట్ నాయకుడు ఆర్కే రోల్ పోషించి ఆకట్టుకున్న ప్రశాంత్ కార్తీ ఈ సినిమాతో మరో డిఫరెంట్ క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రొఫెసర్ రదేశ్ పాత్రలో ఆయన సరిగ్గా సరిపోయాడు.
డాక్టర్ ప్రద్యుమ్న పాత్ర లో అనీష్ కురువెళ్ళ, ధర్మా గా గెడ్డం శ్రీనివాస్ లు తమ సహజ నటనతో ప్రేక్షకులను అలరించారు. శృతిగా రిత్తిక చక్రవర్తి తన పాత్రకు న్యాయం చేసింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు:
ఘంటశాల విశ్వనాథ్ సంగీతం ఈ సినిమాకు ప్లస్. మంచి నేపథ్య సంగీతం తో క్యూరియాసిటి build chesi సీన్స్ ను ఎలివేట్ చేశారు. పాటలు మెరుగ్గా ఉండాల్సింది. సిద్దు సొంసెట్టి సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా క్వాలిటీగా ఉన్నాయి.
విశ్లేషణ:
మరణం లేని మనిషి అనే ఇంటరెస్టింగ్ టాపిక్ తో ఆయుష్షు నేపథ్యంలో సాగే కథ ఇది. డిఫరెంట్ స్టోరీ లైన్ తీసుకొని కొత్త కోణంలో కథను తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ మధుబాల. ఈ విషయంలో దర్శకుడి ప్రయత్నాన్ని అభినందించాలి. మరణం లేకపోవటం అనేది పురాణాల నేపథ్యంలో చూస్తుంటాం. కానీ ఇక్కడ ఒక సాధారణ కథలో అలాంటి పాత్ర పరిచయం చేయడంతో సినిమా మీద ఆసక్తి రేకెత్తిస్తుంది. స్టార్ ట్రెక్ రచయిత జెరోం బిక్స్బీ రాసిన కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ప్రొఫెసర్‌కి వీడ్కోలు చెప్పడానికి వచ్చిన అతని సహచరులు తెలుసుకున్న కొన్ని ఆసక్తికర విషయాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలో చరిత్ర గురించి హీరో చెప్పే కొన్ని విషయాలతో కొత్త అంశాల గురించి తెలుసుకుంటాం. సెకండాఫ్ ఇంటరెస్టింగ్ గా సాగుతుంది. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది.
చివరగా: ఆసక్తికరమైన కథాంశంతో అలరించే అనంత
రేటింగ్: 3/5