స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని లాంచ్ చేసిన  సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ 7:11 PM టీజర్

0
158

సాహస్, దీపికా నటించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్  7:11 PM  ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్ ఆసక్తిని రేపాయి. చైతు మాదాల దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం థ్రిల్లింగ్ అనుభవాన్ని అందించడానికి యూనిక్ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నట్లు ఫస్ట్ లుక్ ద్వారా స్పష్టమైంది. ఈ రోజు, స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని లాంచ్  టీజర్ ద్వారా సినిమాలోని ప్రధాన పాత్రలు, నేపథ్యం , కాన్ఫ్లిక్ట్  ని పరిచయం చేశారు.

ఏలియన్ ప్లానెట్ నుంచి మానవులు: ప్రాక్సిమా EV-12, 400 సంవత్సరాలలో భవిష్యత్తులో మానవుల మనుగడకు కీలకమైన సమాధానాల కోసం “హంసలదీవి” అనే చిన్న ఇండియన్ టౌన్ కి చేరుకుంటారు. అదే రోజున, టౌన్ ని నాశనం చేయడానికి కొన్ని పరిణామాలు జరుగుతుంటాయి. హీరో తన చేతిలోని టైమర్‌ను 7:11 PM లోపు డీయాక్టివేట్ చేయాలి అంటే గడువు కంటే ముందే అతను మిస్టరీని ఛేదించాలి లేదంటే కార్డియాక్ అరెస్ట్ ద్వారా  అతని గుండె ఆగిపోతుంది. హైలీ ఎంగేజింగ్ టీజర్ 7:11 PM ఫాస్ట్ పేస్ద్డ్  సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అనుభూతిని ఇచ్చింది

లిమిటెడ్  బడ్జెట్‌తో,  కొత్త నటీనటులు,  సాంకేతిక నిపుణులతో ఇటువంటి ఫ్యూచర్  సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌ను రూపొందించడం దాదాపు అసాధ్యమైన పని. అయితే, టీం తమ పట్టుదల, కృషి తో దీన్ని సాధ్యం చేసింది. విజువల్స్, కథనం, సాంకేతిక నైపుణ్యంలో ఒక మాస్టర్ పీస్ అన్నట్లుగా వుంది.  టీజర్ గొప్పగా  ఆకట్టుకుంది.

ఆర్కస్ ఫిల్మ్స్ పతాకంపై నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జ్ఞాని సంగీతం అందించారు. ఈ చిత్రానికి శివ శంకర్ , ఫాబియో కాపోడివెంటో సినిమాటోగ్రఫీ అందించగా, శ్రీను తోట ఎడిటర్.

త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని నిర్మాతలు అనౌన్స్ చేస్తారు.

తారాగణం – సాహస్, దీపిక, టెస్, రఘు కారుమంచి, డా. భరత్ రెడ్డి, రైజింగ్ రాజు & ఇతరులు

దర్శకత్వం – చైతు మాదాల
నిర్మాత – నరేన్ యనమదల, మాధురి రావిపాటి & వాణి కన్నెగంటి
సంగీతం – జ్ఞాని
ఆర్ట్ డైరెక్టర్ – కిరణ్ కుమార్ మన్నె / జై లోగిశెట్టి
డీవోపీ – శివ శంకర్ / ఫాబియో కాపోడివెంటో
ఎడిటర్ – శ్రీను తోట
పీఆర్వో – వంశీ-శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here