యువ కథానాయకుడు తేజ్ నటిస్తున్న ద్విభాషా చిత్రం “డ్యూడ్”. తెలుగు – కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పనరోమిక్ స్టూడియోస్ పతాకంపై తేజ్ స్వయంగా నిర్మిస్తుండడమే కాకుండా… స్వయంగా కథను అందించి, దర్శకత్వం వహిస్తుండడం విశేషం. తేజ్ ఇంతకుముందు “రామాచారి” అనే హిట్ చిత్రంలో నటించారు. తను తాజాగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం “గాడ్” ప్రి – ప్రొడక్షన్ లో ఉంది.
ఇప్పటివరకు కొన్ని వేల ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి. కానీ పూర్తి ఫుట్ బాల్ నేపథ్యంలో ఇప్పటివరకు ఏ తెలుగు, కన్నడ భాషల్లో సినిమా రాలేదు. అందువల్లే… కర్ణాటకలోని “కిక్ స్టార్ట్” అనే సుప్రసిద్ధ ఫుట్ బాల్ క్లబ్… “డ్యూడ్” చిత్రానికి పూర్తి సహాయసహకారాలు అందిస్తోంది. అక్టోబర్ లో సెట్స్ కు వెళ్లనున్న ఈ చిత్రానికి కన్నడ – మలయాళ భాషల్లో సుపరిచితుడైన ఇమిల్ మొహమ్మద్ సంగీతం సమకూర్చుతుండగా… నాని కెరీర్ కి తిరుగులేని పునాది వేసిన “అలా మొదలైంది” చిత్రానికి ఛాయాగ్రహణం అందించిన ప్రేమ్ కెమెరా బాధ్యతలు నిర్వహించనున్నారు. తేజస్ ధనరాజ్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఒ: ధీరజ్ – అప్పాజీ, కథ – స్క్రీన్ ప్లే – నిర్మాణం – దర్శకత్వం : తేజ్!!