ఒళ్ళు గుగుర్పోడిచేలా తెలుగు లో మోస్ట్ వయోలెంట్ షో గా మహి వి రాఘవ్ ‘సైతాన్’.. 5న ట్రైలర్.. 15న డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి సిద్దం

0
194

ఏ జోనర్ లో సినిమా తీసినా అందులో అంతక ముందెన్నడూ చూడని కోణం లో నుంచి సినిమా తీసి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసి విజయం సాధించే దర్శకుడు మహి వి రాఘవ్. వెబ్ వరల్డ్ లోకి ప్రవేశించిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్, తన తొలి ప్రయత్నంలోనే తెలుగు లో వన్ ఆఫ్ ద బెస్ట్ షోస్ గా పాపులారిటీ తో దూసుకెళ్తున్న సేవ్ ద టైగర్స్ ను రూపొందించారు. డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సీరీస్ ఇటీవల కాలంలో తెలుగు ఓటీటీ లో వచ్చిన ద బెస్ట్ సీరీస్ గా దూసుకెళ్తోంది.

ఇప్పుడు తన మలి ప్రయత్నంగా డిస్నీ హాట్ స్టార్ లోనే తెలుగు లో మునుపెన్నడూ చూడని స్థాయిలో క్రైమ్, వయోలెన్స్ ను సైతాన్ సీరీస్ లో చూపించబోతున్నారు మహి వి రాఘవ్. ఇప్పటి వరకు రకరకాల జోనర్ లలో చిత్రాలు తీసి మెప్పించిన మహి తొలిసారిగా పీక్ క్రైమ్ లోకి ఎంటర్ అయ్యారు. సేవ్ ద టైగర్స్ లాంటి హిలేరియస్ షో నడిపిన దర్శకుడు అసలు ఇంత వయలెన్స్ వైపు ఎందుకు వచ్చినట్టు.

ఏ తరహా చిత్రాన్ని / షో ను ఎంచుకున్నా అందులోని ఎలిమెంట్ ను పూర్తి స్థాయిలో డీప్ గా డీల్ చేయడం మహి వి రాఘవ్ శైలి. ఆ తరహా లోనే సైతాన్ తో కూడా డీప్ క్రైమ్ వరల్డ్ లోకి తీసుకువెళ్లబోతున్నారు. ‘మీరు దాన్ని క్రైమ్ అని అంటే.. వాళ్ళు మనుగడ కోసం అని అంటున్నారు’, అనే క్యాప్షన్ తో వచ్చిన ఫస్ట్ లుక్ సైతాన్ ఏ స్థాయిలో రాక్తపాతాన్ని మనకి పరిచయం చేయబోతోందో ఒక హింట్ ఇచ్చింది. ఒళ్ళు గగుర్పొడిచేలా ఉండే ఈ ఫస్ట్ లుక్ లో ఒక పోలీస్ ను చంపి రక్తంతో నెలంతా అలికిన కుటుంబం ఎటువంటి భయాందోళనలు లేకుండా ఉండటం మరింత భయానకంగా ఉంది.

పైగా సైతాన్ చూసేప్పుడు జాగ్రత్త అవసరం అనే డిస్క్లైమర్ తో వస్తున్న ఈ వెబ్ సీరీస్ లో రిషి, షెల్లీ, దేవియాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బాలి అనే వ్యక్తి ఫ్యామిలీ ఎలాంటి విపత్కర పరిస్థితికి గురైంది, పర్యవసానంగా ఎలాంటి క్రైమ్ మార్గాన్ని ఎంచుకున్నారు అనేది కీలకంగా ఉంటుంది. మోస్ట్ వయోలెంట్ సన్నివేశాలతో కూడిన వెన్నులో వణుకు పుట్టించే రివేంజ్ డ్రామా గా సైతాన్ రూపొందింది. తెలుగు వెబ్ సిరీస్ లో క్రైమ్ సీన్స్ ను ఇంత సహజత్వం తో కూడిన భయానకంగా చూపించడం ఇదే తొలిసారి.

జూన్ 5న సైతాన్ ట్రైలర్ రిలీజ్ కానుంది. సైతాన్ వెబ్ సిరీస్ జూన్ 15, 2023న డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here