సూర్యుడి వెలుగుకి
చంద్రుడి వెన్నెలకి
చల్లని గాలికి
చక్కని నేలకి
నాతో అవసరం లేదు
నాకే వాటితో అవసరం.
“ఇళయరాజా”కి నాతో అవసరం లేదు
నాకే రోజూ ఆ లయరాజుతో అవసరం.
ఆయన పాట పంచే అమృతంతో అవసరం.
అందుకే ఆయన పుట్టుక నాకు చాలా విలువైనది.
ఆ “సంగీతజ్ఞాని”కి జన్మదిన శుభాకాంక్షలు.
(నా కుంచె చిలికిన నీటి రంగుల్లో “పాట”కు రూపం.)
_____ దేవీప్రసాద్.