‘ మళ్ళీ పెళ్లి’ ఆటంబాంబ్ లా పేలుతుంది. ఎంట‌ర్‌టైన్ చేస్తుంది, షాక్ ఇస్తుంది: హీరో డా. నరేష్ వి.కె

0
295

నవరసరాయ డా. నరేష్ వి.కె గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ‘మళ్ళీ పెళ్లి’ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. యూనిక్ కథతో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో పవిత్ర లోకేష్ కథానాయికగా నటిస్తున్నారు. మెగా మేకర్ ఎం ఎస్ రాజు రచన, దర్శకత్వం వహించారు. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌ పై నరేష్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మళ్లీ పెళ్లి మే 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో డా. నరేష్ వి.కె విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

తొమ్మిదవ యేట పండంటి కాపురం తో నటుడిగా ప్రయాణం మొదలుపెట్టడం నా అదృష్టం. 18వ యేట ‘నాలుగు స్తంభాలాట’తో హీరోగా మారాను. నటుడిగా, నిర్మాతగా, స్టూడియో ఓనర్ గా నా ప్రయాణం గురించి మీకు తెలుసు. నా సినీ జీవితంలో 50వ యేటా, అలాగే విజయ్ కృష్ణ మూవీస్ స్థాపించి 50 ఏళ్ళు.. ఇవన్నీ కలసి వచ్చి.. మళ్ళీ కథానాయకుడిగా ‘మళ్ళీ పెళ్లి’ సినిమా చేయడం నా అదృష్టం.

విజయ్ కృష్ణ మూవీస్ 1972లో స్థాపించారు. అమ్మగారు (విజయ నిర్మల గారు) చాలా మంచి చదువరి. ఆమె ఆలోచనలని సినిమాల్లో చూపించాలని కృష్ణ గారితో కలసి విజయ్ కృష్ణ సంస్థకు శ్రీకారం చుట్టి.. మీనా, కవిత.. ఇలా ఎన్నో విప్లవాత్మక చిత్రాలు తీశారు. విజయ కృష్ణ మూవీస్ మళ్ళీ మొదలు పెడితే మరో సంచలనాత్మక, విప్లవాత్మక చిత్రంతో రావాలని అనుకున్నాం. రాజు గారు చెప్పిన ‘మళ్ళీ పెళ్లి’ కథ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. మళ్ళీ పెళ్లి ఎంటర్ టైన్మెంట్ తో పాటు షాకింగా వుంటుంది.

పెళ్లి అనేది చాలా పవిత్రమైనది. దాన్ని గౌరవించాలానే కోణంలో మళ్ళీ పెళ్లి సినిమా చేశాం. ఈ చిత్రం తెలుగు  కన్నడలో చేశాం. యూత్ లో చాలా బజ్ వచ్చింది. అన్ని ఏజ్ గ్రూపుల వారి కనెక్ట్ అయ్యే కంటెంట్ మళ్ళీ పెళ్లిలో వుంది. చాలా బజ్ వుంది. ఈ బజ్ టికెట్స్ గా కన్వర్ట్ అవుతుందనే నమ్మకం వుంది. ఆల్రెడీ బుకింగ్ ఫుల్ అయ్యాయి. డీసెంట్ ఓపెనింగ్స్ తో విజయ్ కృష్ణ మూవీస్ లో  పెద్ద హిట్ కొడతామనే నమ్మకం వుంది.

ప్రమోషన్స్ చాలా ప్లాన్ గా చేశారు.. టీజర్, గ్లింప్స్ ,. మీ వ్యక్తిగత జీవితానిదా ? సినిమాదా ? అనేది ఎవరికీ అర్ధం కాలేదు. ?
లేదండీ.. అది మా వ్యక్తిగత జీవితానికి సంబంధించినదే. ఎదో గిమ్మిక్ చేసి, ఆడియన్స్ ని చీట్ చేయాలనే ఉద్దేశం మాకు లేదు. ఒకవైపు షూటింగ్ జరుగుతుంటే.. కొన్ని దుష్టశక్తులు అసత్య ప్రచారాలు చేశారు. వాటికీ బ్లాస్ట్ ఇవ్వాలని అనుకున్నాం. పవిత్ర, నేను కలసి జీవిస్తున్నామని చెప్పాలనుకున్నాం. అప్పుడే ఆ లిప్ లాక్ వీడియోని విడుదల చేశాం. అందుకే ఆ వీడియోలపై ఎలాంటి పేర్లు వేయలేదు. అయితే వాటికి దేశవ్యాప్తంగా చాలా బజ్ వచ్చింది. ఇందులో గిమ్మిక్ లేదు. సినిమాలో ఇంకా చాలా షాకింగ్ కంటెంట్ వుంది. మళ్ళీ పెళ్లి ఆటమ్ బాంబ్ లా పేలుతుంది. ఎంటర్ టైన్ చేస్తుంది. షాక్ ఇస్తుంది.

ఎంఎస్ రాజు గారు ఈ కథ చెబుతున్నపుడు మీ జీవితంలో జరిగిన సంఘటనలకు కనెక్ట్ అయ్యారా ? లేదా అలా రాయించరా?
‘డర్టీ హరి’ చూసినప్పుడే రాజు గారితో కనెక్ట్ అయ్యాను. వేరే సబ్జెక్ట్ ని చేయాలని అనుకున్నాం. అదే సమయం కొన్ని సంఘటనలు జరిగాయి. వాటిని ఆయన పరిశీలించారు. ఒక రోజు నా దగ్గరకి వచ్చి.. ‘నేను ఒక కథ చెబుతాను .. అది మీకు, ప్రపంచానికి కనెక్ట్ అవుతుంది’’ అన్నారు. అలా మళ్ళీ పెళ్లి ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. నేను విజల్ కొట్టే సీన్ పబ్లిక్ డొమైన్ లో వుంది. అలా ఎందుకు చేశారని రాజు గారు అడిగారు.(నవ్వుతూ) ఇది బయోపిక్ కాదు. ఇది ఏమిటనేది 26న తెలుస్తుంది. మళ్ళీ పెళ్లి సొసైటీ ని ఫోకస్ చేస్తుంది. అందులో నేను కూడా ఒక భాగం.

కృష్ణ గారి పాత్ర కూడా చూపిస్తారనే ప్రచారం జరుగుతుంది?
ఒక సెలబ్రిటీ జీవితాన్ని తీసుకున్నాం. మదర్, ఫాదర్ పాత్రలు కూడా వుంటే బావుంటుందని అనుకున్నాం. అయితే ఆ పాత్రల గురించి ఇప్పుడే రివిల్ చేయకూడదు. సినిమా చూసిన తర్వాత సర్ ప్రైజ్ అవుతారు. ప్రతి పాత్రకు ప్రాధాన్యత వుంటుంది. మళ్ళీ పెళ్లిలో ఎమోషనల్ కనెక్షన్ కూడా వుంది.

మళ్ళీ పెళ్లిలో హీరోగా నిర్మాతగా చేశారు కదా ఏది ఎక్కువ తృప్తిని ఇచ్చింది ?
నటుడిగా థ్రిల్ వుంది. ఒక సినిమా హిట్టు కొట్టడమే చాలా కష్టం. పదికోట్ల మందిలో వందమంది కూడా బిజీగా వుండరు సినిమాల్లో. పది మంది హీరోలే వుంటారు. నేను ఇన్ని హిట్స్ ఇచ్చి. నేనుగా వెనక్కి వెళ్లాను, మళ్ళీ వచ్చాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాను. ఇప్పుడు మళ్ళీ హీరోగా చేస్తున్నాను. యాభై ఏళ్ళు నటనలో పూర్తి చేసుకోవడం గొప్ప థ్రిల్. నిర్మాతగా పెద్ద బాధ్యత వుంటుంది. అంత పెద్ద బ్యానర్ ని మళ్ళీ తీసుకురావడం, వారి వారసత్వాన్ని కాపాడటం, ఒక మంచి ఎంటర్ టైనర్ ని ఇవ్వడం పెద్ద బాధ్యత. ఈ విషయంలో రాజు గారిని నమ్మాను. చాలా హార్డ్ వర్క్ చేశాం. ఇది రెగ్యులర్ సబ్జెక్ట్ కాదు. చాలా రిసెర్చ్ చేసి చేశాం. నటుడిగా, నిర్మాతగా ఇది పెద్ద ప్రయోగం. యూత్, ఫ్యామిలీ, మాస్..అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా మళ్ళీ పెళ్లి. నిర్మాతగా చాలా కాన్ఫిడెంట్ గా వున్నాను.

మళ్ళీ పెళ్లి మీ వ్యక్తిగత జీవితం పై ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతుంది ? మిస్ అండర్ స్టాండింగ్స్, ట్రోలింగ్స్ ఈ సినిమాతో సమసిపోతాయని భావిస్తున్నారా?
మళ్ళీ పెళ్లి.. సినిమాలో పని చేసిన వారందరికీ ఒక గౌరవం తెచ్చిపెడుతుంది. నటుడిగా ఈ సినిమా నెక్స్ట్ లెవల్ లో వుంటుందనే నమ్మకం వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here