మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ స్విట్జర్లాండ్ లో గ్రాండ్ గా సాంగ్ షూటింగ్

0
248

మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్  మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “భోళా శంకర్”. రామబ్రహ్మం సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ ఓ పాట చిత్రీకరణ కోసం స్విట్జర్లాండ్ పయనమయ్యారు. చిరంజీవి, తమన్నాలపై ఓ సాంగ్ ని గ్రాండ్ గా చిత్రీకరించారు.

ఈ పాటకు సంబధించిన విశేషాలని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా హ్యాండిల్ లో తెలియజేశారు. ”స్విట్జర్లాండ్ లో కళ్ళు చెదిరే అందాలతో మైమరిపించే లొకేషన్స్ లో భోళాశంకర్ కోసం తమన్నాతో ఆట పాట (Song  Shoot ) ఎంతో ఆహ్లాదంగా జరిగింది! ఈ  పాట ప్రేక్షకులందరినీ, మరింతగా అభిమానులందరినీ మెప్పిస్తుందని చెప్పగలను ! త్వరలోనే మరిన్ని సంగతులు పంచుకుందాం ! అప్పటివరకూ ఈ ‘చిరు లీక్స్’ పిక్స్ ”అంటూ లొకేషన్ స్టిల్స్ ని షేర్ చేశారు మెగాస్టార్.

మహతి స్వర సాగర్ ఈ పాట కోసం రాకింగ్ నెంబర్ ని స్కోర్ చేశారు. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ & యాక్షన్‌ సమపాళ్లలో వుండనున్నాయి.

తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేష్,  చిరంజీవి సిస్టర్ గా కనిపించనుంది. టాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ ఈ సినిమాలో లవర్ బాయ్ పాత్రలో నటిస్తున్నాడు.

ఈ చిత్రానికి డడ్లీ డీవోపీ గా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.

‘భోళా శంకర్’ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

తారాగణం:  చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, రఘు బాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, సురేక వాణి, శ్రీ ముఖి, హైపర్ ఆది, వైవా హర్ష ,ప్రదీప్, అనీ, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, వేణు టిల్లు , తాగుబోతు రమేష్ ,రష్మీ గౌతమ్, ఉత్తేజ్, వీర్, షహ్వర్ అలీ & తరుణ్ అరోరా

సాంకేతిక విభాగం :
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మెహర్ రమేష్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
బ్యానర్: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:  కిషోర్ గరికిపాటి
సంగీతం: మహతి స్వర సాగర్
డీవోపీ: డడ్లీ
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
కథా పర్యవేక్షణ: సత్యానంద్
డైలాగ్స్: తిరుపతి మామిడాల
ఫైట్ మాస్టర్స్: రామ్-లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, కాచే కంపాక్డీ
కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీమణి, సిరాశ్రీ
పీఆర్వో: వంశీ-శేఖర్
వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్: యుగంధర్
పబ్లిసిటీ డిజైనర్లు: అనిల్-భాను
డిజిటల్ మీడియా హెడ్: విశ్వ సిఎం
లైన్ ప్రొడక్షన్: మెహెర్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here