రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒకెత్తు అయితే.. ఇకపై చేయబోయే సినిమాలు ఇంకో ఎత్తు. ఇప్పుడు ఆయన పూర్తిగా డిఫరెంట్ జానర్‌లను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. నేడు (మే 20) ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా టాలీవుడ్ నుంచి ఆయనకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఎల్ ఎస్ ప్రొడక్షన్స్ మీద శ్రీమతి మమత సమర్పణలో ప్రొడక్షన్ నెం.3గా ఈ సినిమా రాబోతోంది. ఎం శ్రీనివాసులు, డి వేణు గోపాల్, ఎం మమత, ముల్లపూడి రాజేశ్వరి సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
భాస్కర్ బంటుపల్లి ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. టాలెంటెడ్ టీంతో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇతర వివరాలను మేకర్లు త్వరలోనే తెలియజేయనున్నారు.
The Production No 3 of @lsproductionss Wishes A Very Happy Birthday To Our Own Rocking Star @HeroManoj1
Smt Mamata presents
A rom-com@BhaskarBantupal Directorial#MSrinivasulu #DVenugopal#MMamatha #MulapudiRajeshwari@PROSaiSatish @ParvathaneniRam pic.twitter.com/f3x7lINdNP
— BA Raju's Team (@baraju_SuperHit) May 20, 2023
నటీనటులు : మంచు మనోజ్
సాంకేతికబృందం
బ్యానర్ : ఎల్ ఎస్ ప్రొడక్షన్స్
సమర్పణ : శ్రీమతి మమత
నిర్మాతలు : ఎం శ్రీనివాసులు, డి వేణు గోపాల్, ఎం మమత, ముల్లపూడి రాజేశ్వరి
కథ, దర్శకత్వం : భాస్కర్ బంటుపల్లి
పీఆర్వో : సాయి సతీష్