సత్యదేవ్, డాలీ ధనంజయ పాన్ ఇండియా మూవీ ‘జీబ్రా’ పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభం, త్వరలో ఫస్ట్ లుక్ విడుదల

0
82

టాలెంటెడ్ హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ కథానాయకులుగా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూనిక్  క్రైమ్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ ‘జీబ్రా. లక్‌ ఫేవర్స్‌ ది బ్రేవ్‌.. అన్నది ట్యాగ్ లైన్.

పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ పతాకాలపై ఎస్ ఎన్ రెడ్డి, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్, జెన్నిఫర్ పిచినాటో హీరోయిన్లుగా నటిస్తుండగా, ప్రముఖ నటుడు సత్యరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సత్య, సునీల్ ఇతర ముఖ్య తారాగణం.

ఈ చిత్రం షూటింగ్ 80 శాతం పూర్తయింది. మేకర్స్ ఈ రోజు పోస్ట్ ప్రొడక్షన్ పనులు  ప్రారంభించారు. త్వరలోనే ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నట్లు తెలియజేశారు. ఇదివరకు ఎన్నడూ చూడని ఆర్థిక నేరాల నేపథ్యంలో యధార్ధ సంఘటన స్ఫూర్తితో  ఈ చిత్రం రూపొందుతోంది.

ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్‌ సంగీతం ఓ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. సుమన్ ప్రసార బాగే సహ నిర్మాతగా వున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ సత్య పొన్మార్. మీరాఖ్ డైలాగ్స్ రాస్తుండగా, అనిల్ క్రిష్ ఎడిటర్.

ఈ చిత్రం తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం హిందీ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానుంది.

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: ఈశ్వర్ కార్తీక్
అదనపు స్క్రీన్ ప్లే: యువ
నిర్మాతలు: ఎస్ఎన్ రెడ్డి, బాల సుందరం, దినేష్ సుందరం
బ్యానర్: పద్మజ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్
సహ నిర్మాత: సుమన్ ప్రసార బాగే
డీవోపీ: సత్య పోన్మార్
సంగీతం: రవి బస్రూర్
ఎడిటర్ : అనిల్ క్రిష్
డైలాగ్స్: మీరాఖ్
స్టంట్స్: సుబ్బు
కాస్ట్యూమ్ డిజైనర్: అశ్విని మల్పూరి, గంగాధర్ బొమ్మరాజు
పీఆర్వో వంశీ-శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here